200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!

Honor 700 (1)

Honor 700 (1)

HONOR 700 Series: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో కొత్త సిరీస్‌ను తీసుకొచ్చేందుకు హానర్ (HONOR) సిద్ధమైంది. ఇప్పటికే టీజర్లతో ఆసక్తి పెంచిన కంపెనీ.. కొత్తగా HONOR 700 సిరీస్‌కు సంబంధించిన అనేక కీలక వివరాలను అధికారికంగా వెల్లడించింది. ఈ సిరీస్‌ను నవంబర్ 23న చైనాలోని వుహాన్‌లో ప్రత్యేక ఈవెంట్ ద్వారా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. HONOR 700 సిరీస్‌లో మొత్తం మూడు స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇందులో బడ్జెట్ విభాగంలో HONOR 700S కాగా, మిడ్‌రేంజ్ విభాగంలో HONOR 700, ప్రీమియం ఫీచర్లతో HONOR 700 Pro మోడళ్లు లాంచ్ కానున్నాయి.

ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా 9,000mAh భారీ బ్యాటరీ కానుంది. 3 మోడళ్లలోనూ స్టాండర్డ్‌గా 9,000mAh క్వింగ్‌హై లేక్ బ్యాటరీని అందించనున్నారు. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ మందం కేవలం 7.96mm మాత్రమే ఉండటం విశేషం. సిలికాన్-కార్బన్ యానోడ్ టెక్నాలజీతో రూపొందించిన ఈ బ్యాటరీ అధిక ఎనర్జీ డెన్సిటీని అందిస్తుంది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. HONOR 700 సిరీస్‌లో కొత్త తరం “ఒయాసిస్ ఐ ప్రొటెక్షన్” స్క్రీన్‌ను అందిస్తున్నారు. ఇది 1.5K రిజల్యూషన్, 3840Hz హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్‌తో వస్తుంది. అలాగే డిస్‌ప్లే చుట్టూ కేవలం 0.98mm సిమెట్రికల్ బెజెల్స్ ఉండనున్నాయి.

పెర్ఫార్మెన్స్ పరంగా HONOR 700 లో Snapdragon 8s Gen 4, , HONOR 700 Pro లో Snapdragon 8 Gen 5 ప్రాసెసర్లను అందించనున్నారు. హానర్ ఫాంటమ్ ఇంజిన్ టెక్నాలజీతో వీటిని మరింత ఆప్టిమైజ్ చేయనున్నారు. మూడు మోడళ్లలోనూ థర్డ్ జనరేషన్ RF C3 చిప్, MagicOS 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయి. అంతేకాకుండా ఆపిల్ ఎకోసిస్టమ్‌తో క్రాస్ ప్లాట్‌ఫామ్ కనెక్టివిటీ ఫీచర్లను కూడా అందించనున్నారు. కెమెరాల విషయానికి వస్తే.. మూడు మోడళ్లలోనూ 200MP ప్రైమరీ కెమెరాను అందించనున్నారు. 4K సినిమాటిక్ లైవ్ రికార్డింగ్‌కు కూడా సపోర్ట్ ఉంటుంది. HONOR 700, HONOR 700 Pro మోడళ్లలో అదనంగా 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను ఇవ్వనున్నారు. ఇది 3.5x ఆప్టికల్ జూమ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం 200MP సాఫ్ట్ లైట్ కెమెరా సిస్టమ్‌తో పాటు వేరియబుల్ సాఫ్ట్ లైట్ రింగ్‌ను కూడా అందిస్తున్నారు.

ఈ సిరీస్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ BackDuoFen పేరుతో తీసుకొస్తున్న సెకండరీ డైనమిక్ రియర్ డిస్‌ప్లే. YOYO Doubao AI అసిస్టెంట్‌తో అనుసంధానమైన ఈ చిన్న స్క్రీన్ ద్వారా నోటిఫికేషన్లు, విడ్జెట్లు, AI స్టిక్కర్లు, ఇతర సిస్టమ్ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా వెనుక కెమెరాలతో సెల్ఫీలు తీసుకునేటప్పుడు ఈ డిస్‌ప్లే ప్రివ్యూ స్క్రీన్‌గా పనిచేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక సైడ్ బటన్‌ను కూడా అందించనున్నారు. ఆరోగ్యానికి సంబంధించిన ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. వెనుక కెమెరా మాడ్యూల్‌లోనే హై ప్రెసిషన్ PPG సెన్సార్‌ను అమర్చారు. దీని ద్వారా కేవలం 60 సెకన్లలో హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలు, హార్ట్ రేట్ వేరియబిలిటీ (HRV) వివరాలను తెలుసుకోవచ్చు. ఇప్పటికే HONOR 700 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ముందస్తు బుకింగ్ చేసుకునే వారికి 365 రోజుల రీప్లేస్‌మెంట్ పాలసీని కూడా అందిస్తోంది. ఈ ఫోన్ల ధరలు, ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లు, ఇతర దేశాల్లో విడుదల తేదీలను నవంబర్ 23న జరిగే అధికారిక లాంచ్ ఈవెంట్‌లో వెల్లడించనుంది.