HMD 106 Pure: మొబైల్ తయారీ సంస్థ హెచ్‌ఎండీ (HMD) కొత్తగా మరో కొత్త ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. హెచ్ఎండి 106 పూర్ (HMD 106 Pure) పేరుతో వచ్చిన ఈ ఫోన్ పాకిస్థాన్‌లోని ఓ రిటైల్ స్టోర్‌లో లిస్ట్ అయింది. కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండానే ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ఫోన్‌లో 1.8 అంగుళాల డిస్‌ప్లే, 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధర
HMD 106 పూర్ ఫీచర్ ఫోన్ ధరను పాకిస్థాన్‌లో PKR 3,250గా నిర్ణయించినట్లు రిటైల్ లిస్టింగ్ వెల్లడించింది. భారత కరెన్సీలో దీని ధర సుమారు రూ.1,100 వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్ బ్లూ కలర్ ఆప్షన్‌లో కనిపిస్తోంది. అయితే HMD సంస్థ ఈ ఫోన్‌కు సంబంధించి అధికారిక లాంచ్ ప్రకటన ఇంకా చేయలేదు.
డిస్‌ప్లే
HMD 106 Pureలో 1.8 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే అందించారు. ఇది 120×160 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ ఎస్30+ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ప్రాసెసింగ్ కోసం యూనిసోక్ 6531ఈ చిప్‌సెట్‌ను ఉపయోగించారు.
కెమెరా, స్టోరేజ్
ఈ ఫీచర్ ఫోన్ వెనుక భాగంలో కెమెరా కూడా ఉంది. ఇది 320×240 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఫొటోలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. స్టోరేజ్ విషయానికి వస్తే 32జీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్ ఉన్నట్లు లిస్టింగ్‌లో పేర్కొన్నారు. అదనంగా మైక్రోఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను పెంచుకునే సదుపాయం కూడా ఉంది.
1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్
ఇందులో 1,000mAh బ్యాటరీ అందించారు. ముఖ్యంగా ఈ ఫీచర్ ఫోన్‌లో ఛార్జింగ్ కోసం పాత మైక్రో-యూఎస్‌బీకి బదులుగా యూఎస్‌బీ టైప్-C పోర్ట్ అందించారు. దీంతో ఛార్జింగ్, కనెక్టివిటీ పరంగా వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుంది.
3.5mm హెడ్‌ఫోన్ జాక్
మ్యూజిక్ వినేందుకు HMD 106 Pureలో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఇచ్చారు. అలాగే వినోదం, వార్తలు వినేందుకు ఎఫ్‌ఎం రేడియో సపోర్ట్ కూడా అందించారు. తక్కువ ధరలో సాధారణ అవసరాల కోసం ఫోన్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం HMD 106 Pure పాకిస్థాన్‌లోని రిటైల్ స్టోర్‌లో ధరతో సహా లిస్ట్ అయింది. అయితే ఈ ఫోన్ లాంచ్‌పై HMD నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. భారత మార్కెట్లో ఈ ఫోన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై కూడా ప్రస్తుతానికి స్పష్టత లేదు.

