NTV Telugu Site icon

Technology: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేస్తున్నారా?

Computer

Computer

మనం ఈ లోకాన్ని చక్కగా చూడాలంటే మనకు మంచి కళ్ళు అవసరం. సర్వేంద్రియానాం నయనం ప్రదానం అంటారు అందుకే. అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న వేళ కంప్యూటర్ల వాడకం బాగా పెరిగిపోయింది. రోజుకి 7 నుంచి 8 గంటల పాటు మనం డెస్క్ టాప్, ట్యాబ్ ల ముందు కూర్చుంటాం. అంతకంటే ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తుంటాం. అయితే, ఎక్కడ పనిచేస్తున్నా.. కంటిని సంరక్షించుకోవడం అత్యవసరం.

* కంప్యూటర్ మీద పనిచేస్తున్నప్పుడు కళ్లు త్వరగా అలసిపోతుంటాయి. అదే పనిగా తెరను చూడటం వల్ల నిద్ర సరిగా పట్టదు. ఈ నేప‌థ్యంలో ఈ స‌మ‌స్యకు కారణ‌మై కంప్యూటర్ స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి. మనకు నిద్ర రావటానికి మెలటోనిన్ హార్మోన్ తోడ్పడుతుంది.
* నీలి కాంతి ఈ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. అందుకే పడుకునే ముందు కంప్యూటర్ స్క్రీన్ తదేకంగా చూస్తుంటే నిద్ర దెబ్బ తింటుంది. కంప్యూటర్ స్క్రీన్ కాంతిని తగ్గించుకోవాలి.
* డెస్క్ టాప్ మీద ‘స్టార్ట్’ బటన్‌తో సెటింగ్‌లోకి వెళ్లాలి. అక్కడి నుంచి ‘సిస్టమ్’ ఆప్షన్ను క్లిక్ చేస్తే ‘డిస్ ప్లే’ విభాగం కనిపిస్తుంది. ఇక్కడే ‘కలర్’ ఫీచర్ కింద ‘నైట్ లైట్’ ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఆన్ చేస్తే నీలికాంతి ఆగిపోతుంది.
* దీని ద్వారా కాంతిని పెంచుకోవటం, తగ్గించుకోవటము చేసుకోవచ్చు. కంప్యూటర్ స్క్రీన్ ఎప్పు డు నైట్ లైట్ మోడ్లోకి మారాలో కూడా ముందే నిర్ణయించుకోవచ్చు.
* సిస్టమ్‌ నుంచి వచ్చే బ్లూ లైట్‌, రేడియేషన్‌ వల్ల చర్మ సమస్యలు తెస్తుంది. బ్లూలైట్‌ నుంచి స్కిన్‌ను కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
* ఇంట్లో ఉన్నా కూడా సిస్టమ్‌ ముందు పనిచేసేటప్పుడు యూవీ ప్రొటక్షన్‌ క్రీమ్‌ పెట్టుకోవాలి. లేదా ఎస్‌పీఎఫ్‌ ఉన్న మాయిశ్చరైజర్స్ రాసుకోవాలి.
* పని చేసేటప్పుడు మధ్య మధ్యలో బ్రేక్‌ తీసుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్‌‌గా ఫేస్‌వాష్‌ చేసుకోవాలి. కళ్ళను మూసి కంటి పైభాగాన్ని కూడా శుభ్రంగా కడుగుకోవాలి.
* మీరు కూర్చునే సీటు నుంచి కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ కనీసం 18 ఇంచుల దూరంలో ఉండాలి.
* సిస్టమ్‌ చూసినప్పుడు కళ్లు చిన్నగా చేస్తాం. అలాంటప్పుడు ముడతలు వచ్చే అవకాశం ఉంది. అందుకు, అలాంటి ప్రాబ్లమ్‌ రాకుండా అండర్‌‌ ఐ జెల్‌ ఉపయోగించాలి.
* కంప్యూటర్‌‌ నుంచి వచ్చే వేడి వల్ల స్కిన్‌ డ్రై అయిపోతుంది. అలాకాకుండా ఉండాలంటే రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి. ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
* మీ కళ్ళు పొడిబారి పోతుంటే మాత్రం ఐ స్పెషలిస్ట్ ని కలవాలి. హైడ్రాక్షి ప్రోపిల్ ఆఫ్తాల్మిక్ సొల్యూషన్ అని Eye Drops దొరుకుతాయి. వాటిని రోజుకి కనీసం 4 సార్లు రెండు కళ్ళలో వాడాలి. తరచూ కళ్ళను శుభ్రం చేసుకుని, వాటికి విశ్రాంతినివ్వాలి.

Health Tips: గ్యాస్ సమస్య..? ఈ చిట్కాలతో చెక్ పెట్టేయొచ్చు..!