GTA 6 Pre-Orders: ఆడకముందే రూ. 11,000 కోట్లు.. రిలీజ్‌కు ముందే GTA 6 ఊచకోత! అసలు కథ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GTA 6 Pre-Orders: సినిమా ఇండస్ట్రీలో రిలీజ్‌కు ముందే కోట్లలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగడం మనం చూస్తుంటాం. కానీ ఒక వీడియో గేమ్, అందులోనూ ఒక్కరు కూడా కనీసం కంట్రోలర్ పట్టుకుని ఆడకముందే, కేవలం బుకింగ్స్ రూపంలోనే ఏకంగా రూ.11,000 కోట్లు కొల్లగొట్టడం ఎప్పుడైనా విన్నారా? వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా, గేమింగ్ ప్రపంచంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా అడుగుపెట్టబోతున్న ‘గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6’ (GTA 6), రిలీజ్‌కు ముందే డిజిటల్ స్టోర్లలో ఊచకోత సృష్టిస్తుంది.
నిజానికి గత 13 ఏళ్లుగా గేమింగ్ ప్రియులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న గేమ్ ఇది. రాక్‌స్టార్ గేమ్స్ రూపొందించిన ఈ కొత్త వర్షన్ కోసం జనం ఎంతలా పిచ్చెక్కిపోయి ఉన్నారో తాజా లెక్కలు చూస్తే అర్థమవుతుంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘సెన్సార్ టవర్’ అంచనాల ప్రకారం.. నవంబర్ 13 నాటికే ఈ గేమ్ కోసం సుమారు 1.21 కోట్ల (12.13 మిలియన్లు) డిజిటల్ ప్రీ-ఆర్డర్లు పడిపోయాయి. వీటి విలువ అక్షరాలా 1.18 బిలియన్ డాలర్లు. మన రూపాయల్లో లెక్కేస్తే దాదాపు రూ. 11,050 కోట్లు. అంటే గేమ్ మార్కెట్లోకి రాకముందే, పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసిందన్నమాట.
Also Read
- ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
- Motorola Edge 70 Neo: మోటరోలా Edge 70 Neo భారత్‌లోకి వచ్చేస్తోంది.. 50MP Sony కెమెరా, 7,000mAh బ్యాటరీతో!
- 12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
- Oppo Reno 17, Reno 17 Pro: 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ.. కొత్త Oppo Reno 17 సిరీస్ వచ్చేసింది!
ప్లేస్టేషన్ వర్సెస్ ఎక్స్‌బాక్స్.. ఎవరిది పైచేయి?
ఈ ప్రీ-ఆర్డర్ల జాతరలో సోనీ (ప్లేస్టేషన్ ), మైక్రోసాఫ్ట్ (ఎక్స్‌బాక్స్) స్టోర్ల పాత రికార్డులన్నీ బద్దలయ్యాయి. తమ స్టోర్ల చరిత్రలోనే ఇంత భారీగా ప్రీ-ఆర్డర్లు వచ్చిన గేమ్ మరొకటి లేదని ఈ రెండు కంపెనీలు చేతులెత్తేసి మరీ ప్రకటించాయి. ఇక ఈ రూ. 11 వేల కోట్ల వసూళ్లలో సింహభాగం ప్లేస్టేషన్ 5 (PS5) ఖాతాలోనే పడింది. మొత్తం ఆర్డర్లలో దాదాపు 75 శాతం PS5 నుంచే వచ్చాయి. PlayStation 5 సుమారు 90.8 లక్షల మంది ముందే కొనేశారు. దీని ద్వారా దాదాపు 880 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. Xbox Series X/S నుంచి సుమారు 30.6 లక్షల ప్రీ-ఆర్డర్లు నమోదయ్యాయి. దీని విలువ దాదాపు 296 మిలియన్ డాలర్లు.
ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది..
ఈ నంబర్లు చూసి ఎగిరిగంతేసే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ సెన్సార్ టవర్ అనే సంస్థ వేసిన లెక్కలు మాత్రమే. గేమ్ తయారీ సంస్థ రాక్‌స్టార్ గేమ్స్ గానీ, దాని మాతృసంస్థ టేక్-టూ ఇంటరాక్టివ్ గానీ ఇప్పటివరకు అధికారికంగా ఒక్క నంబర్ కూడా బయటపెట్టలేదు. పైగా ఇవి కేవలం డిజిటల్ ప్రీ-ఆర్డర్ల లెక్కలు మాత్రమే, పూర్తిస్థాయి సేల్స్ కావు. 2013లో వచ్చిన GTA 5 గేమ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. రిలీజ్ అయిన మొదటి మూడు రోజుల్లోనే 1 బిలియన్ డాలర్లు సంపాదించి, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనే అత్యంత వేగంగా ఆ మార్క్ చేరుకున్న ప్రాజెక్ట్‌గా నిలిచింది. ఇప్పుడు GTA 6 ఆ రికార్డును రిలీజ్‌కు ముందే, కేవలం ప్రీ-ఆర్డర్లతోనే దాటేసింది. అయితే, అది రిలీజ్ అయ్యాక వచ్చిన కలెక్షన్, ఇది రిలీజ్‌కు ముందు వచ్చిన బుకింగ్స్ కాబట్టి రెండింటినీ నేరుగా పోల్చలేం. దాదాపు 1.5 నుంచి 3 బిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో ఈ గేమ్‌ను తీర్చిదిద్దారు. ఫ్లోరిడా తరహాలో రూపొందించిన ‘లియోనిడా’ నగరం, పాత ఫ్యాన్స్‌కు ఎంతో ఇష్టమైన ‘వైస్ సిటీ’ నేపథ్యంలో జాసన్, లూసియా అనే ఇద్దరు క్యారెక్టర్ల చుట్టూ ఈ కథ నడుస్తుంది. రిలీజ్‌కు ముందే ఈ రేంజ్లో సునామీ సృష్టించిన GTA 6, నవంబర్ 19న PS5, Xbox Series X Sలలోకి అడుగుపెట్టాక తొలి వారంలో ఇంకెన్ని వింతలు సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
GTA 6 Pre-Orders: ఆడకముందే రూ. 11,000 కోట్లు.. రిలీజ్‌కు ముందే GTA 6 ఊచకోత! అసలు కథ ఇదే..
-
Ramya Krishna : పెళ్లి వద్దన్నారు, విని ఉంటే బాగుండేదనిపిస్తోంది.. విడాకుల వార్తలపై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
-
Electric Comb: బట్టతల బాధితులకు చైనా గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ దువ్వెనతో 28 రోజుల్లోనే వెంట్రుకలు!
-
Dhanush : ‘పొగరు’ అన్న ట్రోల్స్‌కు ధనుష్ కౌంటర్.. అసలు నిజం చెప్పి షాకిచ్చిన స్టార్ హీరో!
-
IPL Retentions 2027: నరైన్ కోసం టాప్ ట్రేడ్.. ఆర్ఆర్ ఆఫర్‌ను తిరస్కరించిన కేకేఆర్!
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..