Site icon NTV Telugu

Gemini 3 Deep Think: గూగుల్​ జెమినీ Deep Think ఫీచర్! ఎవరికి ఉపయోగకరం? ఎలా ఉపయోగించాలి?

Gemini

Gemini

Gemini 3 Deep Think: గూగుల్ మరోసారి కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను పెంచుతూ Gemini 3 Deep Think అనే అధునాతన రీజనింగ్ మోడ్‌ను విడుదల చేసింది. ఇది ప్రస్తుతం జెమినీ యాప్‌లో Google AI Ultra సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులో ఉంది. గురువారం నాడు విడుదలైన ఈ ఫీచర్, బహుళ దశల ఆలోచన, లోతైన విశ్లేషణ, సంక్లిష్ట సమస్యల పరిష్కారంలో ఏఐ‌ను మానవ నిపుణుల స్థాయికి తీసుకెళ్లే దిశగా ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు.

Read Also: IndiGo chaos: “ఇండిగో” మెడలు వంచాలి.. 2009లో “పుతిన్” చేసినట్లు చేయాలి..

అయితే, గూగుల్ దీన్ని ఇప్పటి వరకు రూపొందించిన అత్యంత శక్తివంతమైన రీజనింగ్ మోడ్ గా అభివర్ణిస్తోంది. గణితం, లాజిక్, సైన్స్ లాంటి రంగాల్లో క్లిష్టమైన ప్రశ్నలకు మరింత నిర్మాణాత్మకమైన, లోతైన సమాధానాలు అందించడానికి ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది. ముఖ్యంగా, ఈ మోడ్ ఒకేసారి అనేక రీజనింగ్ మార్గాలను ప్రాసెస్ చేయగలగడం ద్వారా సాధ్యమైన అన్ని పరిష్కారాలను పరిశీలించి, కరెక్ట్ సమాధానాన్ని ఎంచుకోగలదని గూగుల్ చెబుతోంది. ఈ మల్టీ-పాత్ రీజనింగ్ విధానం గత మోడల్స్ పై ప్రభావం చూపిస్తుంది.

Read Also: Kia EV2: సంచలనానికి సిద్ధమవుతున్న కియా.. మినీ ఎలక్ట్రిక్ SUV, EV2ను విడుదల చేయబోతోంది.. 480KM రేంజ్

ఇక, పర్ఫార్మెన్స్ బెంచ్‌మార్క్‌లలో కూడా జెమినీ 3 డీప్ థింక్ ప్రభావంతమైన ఫలితాలు సాధించింది. Humanity’s Last Exam అనే అత్యంత కఠినమైన రీజనింగ్ పరీక్షలో 41 శాతం స్కోర్ చేయడం ద్వారా ఇది పూర్వపు అన్ని మోడల్స్ ను మించిపోయింది. కోడ్ ఎగ్జిక్యూషన్‌ను కలిపి ఉపయోగించిన ARC-AGI-2 బెంచ్‌మార్క్‌లో 45.1 శాతం సాధించి అపూర్వమైన మైలురాయిగా గూగుల్ పేర్కొంది. ఇక, గతంలో గణితం, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పోటీల్లో మానవ స్థాయి ఫలితాలు అందించిన Gemini 2.5 Deep Think పని తీరును మరింతగా అభివృద్ధి చేశాయని గూగుల్ పేర్కొనింది.

కాగా, సాధారణ చాట్ ఆధారిత ఏఐను దాటేసి శాస్త్రీయ, విశ్లేషణాత్మక వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించే సామర్థ్యం కలిగిన మోడళ్లను రూపొందించడమే ఇప్పుడు గూగుల్ ముందున్న ప్రధాన లక్ష్యం. ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా, ఆ సమాధానాల వెనుక ఉన్న తర్కాన్ని కూడా వివరించగల సిస్టమ్‌ను రూపొందించడమే ఈ ఫీచర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పటికే అల్ట్రా సబ్‌స్క్రైబర్‌లు జెమినీ యాప్‌లో “Deep Think” ఆప్షన్‌ను ఎంచుకుని Gemini 3 Pro మోడల్‌తో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

అలాగే, అనేక హైపోతెసిస్‌లను ఒకేసారి పరిశీలించి మరింత ఆధునిక అవుట్‌పుట్‌ను అందించే మా అత్యంత శక్తివంతమైన రీజనింగ్ మోడ్ అని జెమినీ అధికారిక అకౌంట్ ఎక్స్ లో ప్రకటించింది. గత నెలలో విడుదలైన జెమినీ 3, ఇప్పటికే Gemini 2.5 Pro కంటే మెరుగైన ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలిచింది. ఇప్పుడు డీప్ థింక్ సమీకరణంతో పరిశోధకులు, డెవలపర్లు, విద్యార్థుల కోసం ఒక తెలివైన “కో-పైలట్”గా పని చేయగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికీ ఏఐ పోటీలో గూగుల్ మళ్లీ ముందంజలో నిలవాలనే సంకల్పంతో ఈ అప్‌డేట్‌ను తీసుకొచ్చినట్లు గూగుల్ తెలియజేస్తుంది.

Exit mobile version