Google Search Safety Tips Follow These Tips otherwise You May Be Cheated: ఈ రోజుల్లో మనకు ఏం కావాలన్నా ఇంటర్నెట్ ప్రధాన వనరుగా మారింది. ఇప్పుడు ఎలాంటి సమాచారం కావాలన్నా వెంటనే మనం గూగుల్ సెర్చ్ లోకి వెళ్లి వెతికేస్తాం. అయితే ఏదైనా సెర్చ్ చేయవచ్చు కానీ వచ్చిన రిజల్ట్స్ వలన ప్రమాదం కూడా పొంచి ఉంది. మీరు ప్రతిరోజూ ఇంటర్నెట్ సహాయం తీసుకుని పని చేస్తూ ఉంటే కనుక గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ ఎలాంటివి వచ్చినా వాటిని ఫాలో అవుతూ ఉంటే కనుక మీరు పెద్ద తప్పు చేస్తున్నట్టే. మీరు కనుక ఇలా చేస్తే, మీకు ఎప్పుడైనా మీరు మోస పోవచ్చు. ఇది మేం చెబుతున్నది కాదు భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సైబర్ దోస్త్ అనే ఏజెన్సీ. సైబర్ దోస్త్ ఏఏ సలహాలు ఇచ్చారో చూసేయండి.
మీరు Google సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి
మీరు ఏదైనా సెర్చ్ చేసి, వచ్చే రిజల్ట్‌పై స్పాన్సర్ అని రాసి ఉంటే, దానిపై క్లిక్ చేయకండి, ఎందుకంటే అలాంటి ఫలితాలతో మోసం జరిగే అవకాశం ఉంది. ఈ రకమైన కంటెంట్ సెర్చ్ లో పై వరుసలో వస్తుంది. దీనిని డబ్బు చెల్లించి స్పాన్సర్ చేస్తూ ఉంటారు.
మీరు గూగుల్‌లో సెర్చ్ చేయడం ద్వారా కస్టమర్ కేర్ నంబర్‌ను పొందినట్లయితే మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. పొరపాటున కూడా Google శోధన నుండి కస్టమర్ కేర్ నంబర్‌ను తీసుకోవద్దు. ఎందుకంటే ఈ పద్ధతి మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. సంబంధిత కంపెనీ వెబ్‌సైట్ నుండి ఎల్లప్పుడూ కస్టమర్ కేర్ నంబర్‌ను పొందండి.
ఇక ఒక వెబ్‌సైట్ దాని URL లేదా వెబ్ చిరునామాలో “https” వ్రాసి ఉండకపోతే, ఆ సైట్‌ను సందర్శించవద్దు. సాధారణంగా, మోసపూరిత సైట్‌లు https ధృవీకరణను కలిగి ఉండవు. ఏదైనా సమాచారాన్ని నమ్మాలంటే మల్టిపుల్ రిజల్ట్స్ చెక్ చేయండి.
మీ Google ఖాతా సెర్చ్ హిస్టరీ క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండండి. దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, ఎవరైనా మీ జీమెయిల్‌ని ఉపయోగిస్తుంటే అది మీకు తెలుస్తుంది.