Site icon NTV Telugu

Arm Cortex-M55 కోప్రాసెసర్‌, Gemini AI అసిస్టెంట్, హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో Google Pixel Watch 4 లాంచ్..!

Google Pixel Watch 4

Google Pixel Watch 4

Google Pixel Watch 4: గూగుల్ (Google) సంస్థ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Google Pixel Watch 4ను అధికారికంగా భారత్ లో లాంచ్ చేసింది. ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లలో ఇది ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పనుంది. గూగుల్ పిక్సెల్ (Pixel) ఎకోసిస్టమ్‌లో చేరిన ఈ సరికొత్త వాచ్ డిజైన్, అద్భుతమైన పనితీరు, ఆరోగ్య ట్రాకింగ్‌ల కలయికగా వినియోగదారులకు లభించనుంది. ఈ వాచ్ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో ఆన్‌లైన్‌లో మాత్రమే లభిస్తుంది. రూ.39,990 ప్రారంభ ధరతో పాటు నో-కాస్ట్ ఈఎంఐ (EMI) ఆప్షన్‌లు, ఆరు నెలల కాంప్లిమెంటరీ ఫిట్‌బిట్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో ఇది లభించనుంది.

Vikarabad District : కుల్కచర్ల ఎమ్మార్వో ఆఫీస్ ముందు రైతుల ధర్నా !

Pixel Watch 4 డిజైన్ తోనే వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇది వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా 41mm, 45mm అనే రెండు డయల్ సైజులలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ Snapdragon W5 Gen 2 చిప్‌సెట్, Arm Cortex-M55 కోప్రాసెసర్‌తో శక్తివంతంగా పనిచేసే ఈ వాచ్ మెరుపు వేగంతో పనితీరు, మెరుగైన మల్టీటాస్కింగ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. యాప్‌లలో నావిగేట్ చేయడం నుండి నోటిఫికేషన్‌లను స్వీకరించడం వరకు ప్రతిది సున్నితంగా, త్వరగా జరుగుతుంది. ఈ వాచ్ కొత్త Actua 360 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 3000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో అద్భుతమైన స్పష్టతను ఇస్తుంది. ఎడ్జ్-టు-ఎడ్జ్ Corning® Gorilla® Glass డిస్‌ప్లే స్క్రాచ్‌లకు నిరోధకతను అందిస్తుంది.

Ricoh GR యాంటీ గ్లేర్ కెమెరా, IP66+IP68+IP69 సర్టిఫికేషన్లతో వచ్చేసిన Realme GT8 Pro Aston Martin F1 లిమిటెడ్ ఎడిషన్..!

ఈ వాచ్ బ్యాటరీ పనితీరు మరో హైలైట్. 41mm వేరియంట్ 30 గంటల వరకు, 45mm మోడల్ 40 గంటల వరకు వినియోగాన్ని అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వడం వల్ల కొద్ది నిమిషాల్లోనే ఛార్జ్ చేసి ఎక్కువసేపు వాడుకోవచ్చు. IP68 రేటింగ్‌తో ఇది నీరు, ధూళికి నిరోధకతను కలిగి ఉంది. ఫిట్‌బిట్ ప్రీమియం ఇంటిగ్రేషన్ ద్వారా ఆరోగ్యం, ఫిట్‌నెస్ ఈ వాచ్ అనుభవంలో కీలక అంశాలుగా ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ నిరంతర హృదయ స్పందన పర్యవేక్షణ, ECG, SpO₂, నిద్ర విశ్లేషణ, ఒత్తిడి నిర్వహణ వంటి అధునాతనలను అందిస్తుంది. AI ఆధారిత వెల్నెస్ ట్రాకింగ్‌తో పాటు వ్యక్తిగతీకరించిన వర్కౌట్ సిఫార్సులను, సంపూర్ణ ఆరోగ్య వివరాలను అందిస్తుంది.

Exit mobile version