స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నాయి.. ఆయా సంస్థలు.. ఐఫోన్ మొదలు చాలా మొబైల్ ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.. ఇక, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం అనేక స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప డీల్‌లు నడుస్తున్నాయి.. నచ్చిన ఫోన్‌ను చౌక ధరకే కొనుగోలు చేయాలనుకుంటే.. మీరు ఈ డీల్‌లను సద్వినియోగం చేసుకోవచ్చు. అలాంటి ఒక డీల్ గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌లో ఉంది.. దీనిని మీరు ఇప్పుడు మీస్ చేసుకుంటే.. పొరపాటు చేసినట్టే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు..
Read Also: Vaibhav Suryavanshi: శతక్కొడుతున్న చిచ్చరపిడుగు.. ఆరు టోర్నమెంట్‌లు.. ఆరు శతకాలు
ఫోల్డబుల్ ఫోన్ కొనాలనుకునే వారికి ఈ డీల్ చాలా ముఖ్యమనే చెప్పాలి.. ఎందుకంటే.. గత సంవత్సరం ప్రారంభించబడిన ఈ ఫోన్ ప్రస్తుతం ఏకంగా రూ.77,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుండి డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో రూ.99,999కి జాబితా చేయబడింది. అంటే ఆ ఫోన్‌పై రూ.73,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఇచ్చింది.. కంపెనీ గత సంవత్సరం ఈ ఫోన్‌ను రూ.1,72,999 కు విడుదల చేసింది. ఈ ధరలో 16GB RAM మరియు 256GB స్టోరేజ్ ఉన్న ఫోన్ కూడా ఉంది.
ఈ డిస్కౌంట్‌కు తోడు.. బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో మీరు బ్యాంక్ ఆఫర్ కింద మరో రూ.4,000 ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ SBI మరియు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డులపై అందుబాటులో ఉంది. రెండు ఆఫర్లతో, మీరు ఈ ఫోన్‌పై రూ.77,000 ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు.. 5,000 రూపాయల అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. అయితే, ఈ ఆఫర్ ఎంపిక చేసిన ఫోన్‌ల ఎక్స్ఛేంజ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.3-అంగుళాల కవర్ డిస్‌ప్లే.. మరియు 8-అంగుళాల ప్రధాన డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. దీనిలో 48MP + 10.5MP + 10.8MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు 10MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 4650mAh బ్యాటరీ ఉంటుంది..
