Site icon NTV Telugu

ఎండాకాలంలో చల్లటి న్యూస్.. Godrej 1.5 Ton ఇన్వర్టర్ ఏసీపై రూ. 13,000 భారీ డిస్కౌంట్..!

Godrej

Godrej

Godrej 1.5 Ton Inverter AC Deal: ఎండాకాలం వచ్చిందంటే ఇంట్లో ఏసీ అవసరం తప్పనిసరిగా మారుతుంది. బయట ఉండే తీవ్రమైన వేడిని తట్టుకోవడానికి మంచి కూలింగ్, తక్కువ పవర్ వినియోగం కలిగిన ఏసీ ఎంపిక చాలా ముఖ్యం. అలాంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని గోద్రేజ్ కంపెనీ నుంచి వచ్చిన 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ మంచి ఆప్షన్‌ గా నిలుస్తోంది.

Mercedes-Benz V-Class: గర్ల్ ఫ్రెండ్ కు రూ. 1.7 కోట్ల విలువైన కారును బహుమతిగా ఇచ్చిన హార్దిక్ పాండ్యా..!

ఈ గోద్రేజ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ అధునాతన ఫీచర్లతో రూపొందించబడింది. ఇందులో 5-in-1 కన్వర్టిబుల్ కూలింగ్ సిస్టమ్ ఉండటం వల్ల అవసరానికి అనుగుణంగా కూలింగ్ మోడ్‌ను మార్చుకోవచ్చు. 52°C వరకు కూడా హేవీ డ్యూటీ కూలింగ్ అందించే సామర్థ్యం ఈ ఏసీకి ప్రత్యేకత. అలాగే యాంటీ ఫ్రీజ్ థర్మోస్టాట్, హిడెన్ డిస్‌ప్లే, ప్యూర్ ఎయిర్ ఫిల్టర్, సెల్ఫ్ డయాగ్నోసిస్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఇది ఇన్వర్టర్ టెక్నాలజీతో పనిచేసే స్ప్లిట్ ఏసీ కావడంతో విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. 1.5 టన్ సామర్థ్యం గల ఈ ఏసీ సుమారు 170 చదరపు అడుగుల గదులకు సరిపోతుంది. ఈ ఏసీ 4850W కూలింగ్ పవర్, 1680W విద్యుత్ వినియోగంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే 38Db తక్కువ శబ్దంతో పనిచేయడం వల్ల ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఈ ఏసీలో R-32 రిఫ్రిజెరెంట్ ఉపయోగించడం వల్ల పర్యావరణానికి తక్కువ హానికరం. కాపర్ కండెన్సర్‌తో తయారైనందున దీర్ఘకాలికంగా పనితీరు మెరుగ్గా ఉంటుంది. రోటరీ ఇన్వర్టర్ కంప్రెసర్ ఉండటం వల్ల కూలింగ్ వేగంగా, స్థిరంగా ఉంటుంది. ఇంకా దీనికి 5 సంవత్సరాల కంప్రెహెన్సివ్ వారంటీ కూడా అందిస్తున్నారు.

Ajinkya Rahane: 25 కోట్లు పెట్టి కొన్న గ్రీన్‌తో ఎందుకు బౌలింగ్ చేయించలేదు.. ఆసక్తిర సమాధానం చెప్పిన కేకేఆర్ కెప్టెన్!

ఇక ధర విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ ఏసీపై భారీ ధర తగ్గింపు అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 42,300 కాగా.. ఇప్పుడు సుమారు 33% భారీ తగ్గింపుతో రూ. 28,490కే లభిస్తోంది. అంతేకాకుండా నో కాస్ట్ EMI, బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ వంటి ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ధరలో ఇలాంటి బెస్ట్ ఫీచర్లతో వచ్చే ఏసీ కొనడానికి మంచి డీల్‌గా చెప్పుకోవచ్చు.

Exit mobile version