Flipkart 2025 Sale: ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం బైబై 2025 సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ సందర్భంగా చాలా కంపెనీలు అద్భుతమైన డీల్‌లను అందిస్తున్నాయి. ఈ అద్భుతమైన డీల్‌లను అందించే జాబితాలో థామ్సన్ కంపెనీ కూడా చేరింది. ఈ కంపెనీ తన స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్‌లపై సూపర్ ఆఫర్‌లను విడుదల చేసింది. ఈ ఆఫర్‌ల కింద, వాషింగ్ మెషీన్లు రూ.4,590 నుంచి, స్మార్ట్ టీవీలు రూ.5,999 నుంచి స్టార్ అవుతున్నాయి. వాటి ధరలు, ఆఫర్‌లను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: X Platform Penalty: ప్రపంచ కుబేరుడి సంస్థకు రూ.1080 కోట్ల జరిమానా.. కారణం ఇదే !
థామ్సన్ టీవీలు: రూ.5999 నుంచి స్టార్ట్..
థామ్సన్ 24 అంగుళాల టీవీ ప్రారంభ ధర రూ.5,999గా నిర్ణయించగా, 32 అంగుళాల మోడల్ రూ.8,299 నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ మినీ QD LED టీవీలను కూడా ప్రవేశపెట్టింది. ఈ సేల్‌లో MEMEC , Jio TeleOS టీవీలు కూడా అందుబాటులో ఉన్నాయి. 65 అంగుళాల వరకు మోడల్‌లు రూ.39,999 నుంచి రూ.89,999 వరకు అందుబాటులో ఉన్నాయి. థామ్సన్ మినీ LED టీవీలు స్మార్ట్ ఐ షీల్డ్, 540 లోకల్ డిమ్మింగ్, డైనమిక్ బ్యాక్‌లైట్ వంటి సాంకేతికతలను కలిగి ఉన్నాయి. ఈ టీవీలు మినీ QD 4K డిస్ప్లేలు, 108W స్పీకర్ సిస్టమ్‌లతో వస్తున్నాయి. Google TV ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఈ పరికరాలు గేమింగ్, స్ట్రీమింగ్, OTT వీక్షణను సులభతరం చేయడంతో పాటు ఆకర్షణీయంగా మారుస్తాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ టీవీలు డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ ప్లస్, HDR10+ కూడా మద్దతు ఇస్తాయి.
రూ.4590 కే వాషింగ్ మెషీన్..
థామ్సన్ వాషింగ్ మెషీన్లు రూ.4,590 నుంచి స్టార్ట్ కానున్నాయి. అధిక సామర్థ్యం గల మోడళ్లు రూ.15,999 వరకు లభిస్తాయి. 5-స్టార్ BEE రేటింగ్‌తో ఈ మెషీన్లు ఆరు-పల్సేటర్ వాష్, ఎయిర్-డ్రై ఫంక్షన్ వంటి లక్షణాలతో వస్తున్నాయి. యాంటీ-వైబ్రేషన్ డిజైన్, చైల్డ్ లాక్, ఆక్వా రిస్టోర్, ఆటోమేటిక్ దిద్దుబాటు, టబ్ క్లీన్ వంటి సాంకేతికతలతో భారతీయ అవసరాలకు అనుగుణంగా తయారు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
READ ALSO: Kasuri – Masood: జైషే అగ్ర కమాండర్ల ‘రహస్య సమావేశం’.. భారత్‌పై భారీ కుట్రకు ప్లాన్!
