Flipkart Big Billion Days Sale 2026: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరోజు నుంచే.. స్మార్ట్ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు
- ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ డేట్ లీక్
- స్మార్ట్ఫోన్లు, టీవీలు తక్కువ ధరకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flipkart Big Billion Days Sale 2026: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నిర్వహించే బిగ్ బిలియన్ డేస్ (Big Billion Days) సేల్ కోసం ఆన్లైన్ షాపింగ్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది ఫెస్టివల్ సీజన్లో నిర్వహించే ఈ మెగా సేల్‌లో స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఏసీలు, ఫ్రిజ్‌లు, హోమ్ అప్లయన్సెస్‌తో పాటు వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి వస్తాయి. అయితే ఈ ఏడాది బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభ తేదీపై ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఓ యూజర్ షేర్ చేసిన పోస్టర్ ప్రకారం ఈ సేల్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
అక్టోబర్ 9 నుంచి సేల్?
Xలో వైరల్ అవుతున్న పోస్టర్ ప్రకారం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సాధారణ వినియోగదారులకు అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. అదే పోస్టర్లో Axis Bank, ICICI Bank కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ వివరాలను ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా ధృవీకరించలేదు. కాబట్టి సేల్ ప్రారంభ తేదీ, బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్ వివరాలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వీటిని అంచనాలుగానే చూడాలి.
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ప్లస్ సభ్యులకు ముందుగానే యాక్సెస్?
ఫ్లిప్‌కార్ట్ గతంలో నిర్వహించిన బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో Flipkart Plus, Black సభ్యులకు సాధారణ వినియోగదారుల కంటే ముందుగానే సేల్ యాక్సెస్ ఇచ్చింది. తాజా లీక్ ప్రకారం కూడా ఇదే విధానం కొనసాగితే, సాధారణ వినియోగదారులకు అక్టోబర్ 9న సేల్ ప్రారంభమయ్యే ముందు రోజు, అంటే అక్టోబర్ 8 నుంచే Plus సభ్యులకు యాక్సెస్ లభించే అవకాశం ఉంది. అయితే ఈ వివరాలపై కూడా ఫ్లిప్‌కార్ట్ నుంచి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.
స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు?
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ప్రధానంగా స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక డీల్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. Apple, Samsung, Motorola వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఫోన్లపై ధర తగ్గింపులు, బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, ఇతర ఆఫర్లు అందుబాటులో ఉండొచ్చు. కొత్తగా విడుదలైన స్మార్ట్ఫోన్లపై కూడా ప్రత్యేక డీల్స్ లభించే అవకాశం ఉండటంతో ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఈ సేల్ కీలకంగా మారవచ్చు.
టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఏసీలపైనా డిస్కౌంట్లు
స్మార్ట్ఫోన్లతో పాటు టీవీలు, ల్యాప్‌టాప్‌లు, PCలు, ట్యాబ్లెట్లు, హెడ్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ యాక్సెసరీలపై కూడా డిస్కౌంట్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, మైక్రోవేవ్ ఓవెన్లు, ఇతర హోమ్ అప్లయన్సెస్‌పై కూడా ఫెస్టివల్ సేల్ సందర్భంగా ప్రత్యేక ధరలు అందుబాటులోకి రావచ్చు.
గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభం
గత ఏడాది ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమైంది. Flipkart Plus, Black సభ్యులకు సాధారణ వినియోగదారుల కంటే 24 గంటల ముందుగానే సేల్ యాక్సెస్ ఇచ్చారు. ఈ ఏడాది కూడా ఫ్లిప్‌కార్ట్ ఇదే తరహాలో ముందస్తు యాక్సెస్ అందిస్తుందా? సేల్‌లో ఏ బ్రాండ్లకు ఎలాంటి ఆఫర్లు ఉంటాయి? అనే వివరాలు అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టమవుతాయి.
అమెజాన్‌లోనూ ఫెస్టివల్ సేల్?
ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మరో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ Amazon కూడా అక్టోబర్‌లో ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ప్రత్యేక సేల్ నిర్వహించే అవకాశం ఉంది. గతంలో రెండు సంస్థలు ఫెస్టివల్ సీజన్లో పోటీపడి స్మార్ట్ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందించాయి. అందువల్ల ఈ ఏడాది కూడా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఫెస్టివల్ సేల్స్‌లో వినియోగదారులకు భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ అందే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!