Site icon NTV Telugu

Huawei unveils Mate XT: ఐఫోన్ విడుదలైన గంటల్లోనే.. “ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్”ని తీసుకువచ్చిన హువావే..

Huawei Unveils Mate Xt

Huawei Unveils Mate Xt

Huawei unveils Mate XT: మొబైల్ మార్కెట్‌లో ఇప్పటికే ఫ్లిప్, ఫోల్డ్ ఫోన్లు వచ్చాయి. ఇప్ప్పుడు అంతకుమించి స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. చైనాకు చెందిన టెక్ దిగ్గజం హువావే తొలిసారిగా ‘‘ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్’’‌ని తీసుకువచ్చింది. ఆపిల్ ఐఫోన్ 16 విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే తన ప్లాగ్ షిఫ్ ఫోన్‌ని హువావే ఆవిష్కరించింది. చైనాలో షెన్‌జెన్‌లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో హువావే ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ యూ ద్వారా ‘మేట్ XT’ అధికారికంగా విడుదలైంది.

Read Also: Regina Cassandra : లవ్ మీద పెద్ద ఇంప్రెషన్..చాలా రిఫ్రెషింగ్ .. రెజీనా ఇంటర్వ్యూ

రెడ్, గోల్డ్ కలర్‌లో ఉన్న ఈ ఫోన్ అధికారికంగా సెప్టెంబర్ 20న అమ్మకానికి వస్తుంది. ఈ ఫోన్ విడుదల కాకముందే, దీనిని కొనుగోలు చేసేందుకుందు ప్రపంచవ్యాప్తంగా 3 మిలియన్ల మంది ఆసక్తి చూపించారు. ఫోల్డబుల్ ఫోన్ విభాగంలో హువావే ఎప్పుడూ అగ్రగామిగా ఉంటేందని రిచర్డ్ యూ అన్నారు.

హువావే మేట్ ఎక్స్‌టీ మొత్తం 10.2 అంగుళాల డిస్ ప్లేని కలిగి ఉంటుంది. ఇది ఇది 66W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,600mAh బ్యాటరీని ప్యాక్‌తో రాబోతోంది. ట్రిపుల్ ఫోల్డ్ ప్రారంభ ధర 19,999 యూవాన్( సుమారుగా రూ. 2,35,000)డి ఉంది. ఇది మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్లతో లభ్యం కానుంది. అన్నింటిలో 16 జీబీ RAMతో 256GB స్టోరేజ్‌తో కూడిన బేస్ మోడల్ 19,999 యువాన్లకు (సుమారు రూ. 2,35,000), 512GB వేరియంట్ ధర 21,999 యువాన్లకు (సుమారు రూ. 2,59,000), మరియు 1TB వేరియంట్ 23,999 యువాన్లకు (సుమారు 003,8) అందుబాటులో ఉంటుంది. దీంట్లో కిరిన్ 9000S చిప్ సెట్ వాడారు. ఇది 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 5.5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో 12-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది.

Exit mobile version