Site icon NTV Telugu

Tech Tips: ఫోన్‌లో ఇన్​కాగ్నిటో ట్యాబ్ లాక్ చేయాలనుకుంటున్నారా?.. ఇలా చేయండి!

Incognito

Incognito

ఫోన్ హ్యూమన్ లైఫ్ స్టైల్లో ఎంత ఇంపార్టెంట్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమాచారం చేరవేసే దగ్గర్నుంచి.. ఆర్థిక లావాదేవీల వరకు ఫోన్ ఉపయోగించడం తప్పనిసరి అయిపోయింది. ఏదైనా తెలియని విషయం తెలుసుకోవాలన్నా ఫస్ట్ వచ్చే ఆలోచన ఫోన్ మాత్రమే. పక్కవాళ్లను అడిగే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అయితే కొన్ని సార్లు రహస్య విషయాలను, సీక్రెట్ కంటెంట్ ను ఫోన్ లో సెర్చ్ చేసేందుకు ఇన్ కాగ్నిటో ట్యాబ్ ను యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇన్ కాగ్నిటో ట్యాబ్ ను ఎవరూ చూడకూడదనుకుంటే దాన్ని ఈజీగా లాక్ చేసుకోవచ్చు.

Also Read:Stomach Pain Reasons: మహిళలకు సాధారణ సమయాల్లో కడుపు నొప్పి వస్తుందా? జాగ్రత్త?

ఇన్ కాగ్నిటో మోడ్ లో సెర్చ్ చేసిన విషయాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టం లేనప్పుడు లాక్ చేసుకోవచ్చు. సింపుల్ స్టెప్స్ ద్వారా Android ఫోన్‌లోని అజ్ఞాత విండోను సులభంగా లాక్ చేయగలుగుతారు.

ముందుగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ క్రోమో ఓపెన్ చేయాలి.

తర్వాత మీరు కుడి ఎగువన కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.

ఇప్పుడు మీరు సెట్టింగ్‌ల ఆప్షన్ ను ఎంచుకోవాలి.

తరువాత మీరు స్క్రీన్‌పై కనిపించే మోర్ ఆప్షన్స్ నుంచి ప్రైవసీ అండ్​సెక్యూరిటీ ఆప్షన్​ను ఎంచుకోవాలి.

తరువాత విండోలో అజ్ఞాత ట్యాబ్‌లను లాక్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది.

దీనిపై ట్యాప్ చేసిన తర్వాత, మీరు Chrome నుంచి నిష్క్రమించినప్పుడు లాక్ ఇన్ కాగ్నిటో ట్యాబ్‌ల టోగుల్‌ను ప్రారంభించాలి.

Also Read:CM Revanth Reddy : పద్మవిభూషణ్ నాగేశ్వర రెడ్డి భారత రత్నకు కూడా అర్హుడు

మీరు ఇలా చేసిన తర్వాత, ఎవరైనా Google Chrome బ్రౌజర్‌ను తెరిచి మీ అజ్ఞాత ట్యాబ్‌ను యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు, వారు అలా చేయలేరు. మీరు మీ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ లాక్ సెట్ చేసి ఉంటే, మీరు మీ వేలిముద్రను నమోదు చేసుకోవాలి. ఇది కాకుండా, మీరు ఫేస్ ఐడి లేదా పిన్-పాస్‌వర్డ్ వంటి ఆప్షన్స్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు వద్దనుకుంటే ఈలాక్ ను ఆఫ్ చేసుకోవచ్చు.

Exit mobile version