Dell Pro Plus Earbuds: భారత మార్కెట్‌లో డెల్ సంస్థ ఆడియో పోర్ట్‌ఫోలియోను పెంచే దిశలో భాగంగా… తాజాగా సంస్థ Dell Pro Plus Earbuds (EB525) ను విడుదల చేసింది. ఉద్యోగులు, హైబ్రిడ్ వర్క్, బిజినెస్ వినియోగదారుల కోసం రూపొందించిన ఈ ఇయర్‌బడ్స్ AI ఆధారిత నాయిస్ ఫిల్టరింగ్, అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), మరియు రోజంతా సౌకర్యవంతమైన వినికిడి అనుభవాన్ని అందిస్తాయి. 11.6 mm డ్రైవర్‌లతో వచ్చే ఈ Dell Pro Plus Earbuds ప్రపంచంలోనే తొలి ‘మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఓపెన్ ఆఫీస్ సర్టిఫికేషన్’ పొందిన ఇయర్‌బడ్స్‌గా నిలిచాయి. మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్ ప్లాట్‌ఫారమ్‌లకు సర్టిఫై చేయబడి ఉండటంతో వర్చువల్ మీటింగ్‌లు లేదా రిమోట్ వర్క్ సమయంలో క్లియర్ ఆడియోతో కమ్యూనికేషన్‌ను సులభతరం చేస్తాయి.
Delhi Car Blast: మహిళా ఉగ్ర డాక్టర్‌కు పుల్వామా మాస్టర్‌మైండ్ భార్యతో సంబంధం..
ఈ కొత్త ఇయర్ బడ్స్ ముఖ్య ఫీచర్లలో AI ఆధారిత నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్ ప్రధానమైనది. వినియోగదారుడి వాయిస్‌ను 500 మిలియన్‌కు పైగా నాయిస్ సాంపిల్స్‌పై ట్రెయిన్ చేసిన న్యూరల్ నెట్‌వర్క్ ద్వారా ఐసోలేట్ చేస్తుంది. అడాప్టివ్ ANC టెక్నాలజీ చుట్టుపక్కల శబ్దాన్ని తగ్గించడంతో పాటు, “ఎన్‌హాన్స్డ్ ట్రాన్స్‌పరెన్సీ మోడ్” ద్వారా అవసరమైనప్పుడు వాతావరణ శబ్దాలను వినిపిస్తుంది. ఇక సౌకర్యం కోసం ఈ ఇయర్‌బడ్స్ నాలుగు వేర్వేరు సైజుల్లో (XS, S, M, L) ఇయర్ టిప్స్‌తో వస్తాయి. Dell Audio మొబైల్ యాప్ ద్వారా ఈక్వలైజర్, ప్రీసెట్‌లు, ట్రాన్స్‌పరెన్సీ సెట్టింగులను వ్యక్తిగతంగా మార్చుకునే అవకాశం ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా ఇందులో Bluetooth 5.3, డెల్ పెయిర్ టెక్నాలజీ, USB-C ఆడియో రిసీవర్ సపోర్ట్‌తో ఈ ఇయర్‌బడ్స్ 8 పరికరాల వరకు కనెక్ట్ చేయగలవు. దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం IP54 రేటింగ్ అందించబడింది. ఇక టెక్నికల్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ ఇయర్‌బడ్స్ 20 Hz నుండి 20 kHz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కలిగి ఉన్నాయి. ఇవి ఒక్కసారి ఛార్జ్ చేస్తే ANC ఆన్‌లో 8 గంటల వరకు వినికిడి సమయాన్ని ఇస్తాయి. కేస్‌తో కలిపి మొత్తం బ్యాటరీ లైఫ్ 33 గంటల వరకు ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో గంటపాటు వినివచ్చు. USB-C, వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఒక్క ఇయర్‌బడ్ 6 గ్రాముల బరువుతో ఉండగా.. కేస్ 50.4 గ్రాముల బరువుతో వస్తుంది. మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు సర్టిఫికేషన్ పొందిన ఈ ఇయర్‌బడ్స్‌కు రెండు సంవత్సరాల లిమిటెడ్ హార్డ్‌వేర్ వారంటీ అందించబడింది. ధర విషయానికొస్తే.. Dell Pro Plus Earbuds (EB525) రూ.18,699 ధరకు బిజినెస్ యూజర్ల కోసం అందుబాటులో ఉన్నాయి.
