Site icon NTV Telugu

Foldable Houses: ఫోల్డబుల్ ఇల్లు వచ్చేశాయ్.. 4 గంటల్లోనే మీ సొంత ఇల్లు రెడీ!

Foldable Houses

Foldable Houses

Foldable Houses: ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే మాటలను మనం ఇప్పటికీ తరచుగా వింటూ ఉంటాం. ఎందుకంటే ఇల్లు, పెళ్లి అనేది జీవితాంతం ఉండేవి కాబట్టి, చాలా జాగ్రత్తగా, ఎలాంటి తప్పులు లేకుండా చూసుకుంటారు. నిజానికి ఇండియాలో ఈ రోజుకు కూడా ఇల్లు కట్టడం అనేది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. డిజైన్, సామగ్రి, పని వాళ్లు, వాతావరణం అన్నీ కూడా ఇల్లు కట్టే సమయాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో, షార్క్ ట్యాంక్ ఇండియా కొత్త సీజన్‌లో అప్రియర్ బిల్డ్ అనే స్టార్టప్ కనిపించింది. భారతదేశంలో అలాంటి స్టార్టప్‌లు ఎక్కువగా లేనప్పటికీ, గంటల్లో ఇళ్లను నిర్మించగల కంపెనీలు యూరప్, యుఎస్‌లలో పుష్కలంగా ఉన్నాయి.

READ ALSO: Heart Attack During Pregnancy: ఈ ఏజ్‌ దాటితే.. గర్భధారణ సమయంలో గుండెపోటు.. షాకింగ్..

అప్రియర్ బిల్డ్ ఈ కంపెనీ మోడల్ మాడ్యులర్ నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. దీని అర్థం ఇంటిలోని గోడలు, అంతస్తులు, పైకప్పులు, వైరింగ్, ప్లంబింగ్ వంటి భాగాలను ఫ్యాక్టరీలో తయారు చేసి, ఆ తర్వాత ఇంటిని నిర్మించే సైట్‌కు తీసుకువచ్చి అసెంబుల్ చేస్తారు. కేవలం 4 గంటల్లోనే ఒక ప్రామాణిక యూనిట్‌ను ఆన్-సైట్‌లో ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇలా కట్టిన ఇల్లు డిజైన్ పరంగా, నాణ్యత పరంగా దృఢంగా కనిపిస్తుంది. ఈ ఇంటిని 30-40 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించవచ్చని సదరు కంపెనీ పేర్కొంది.

మడతపెట్టగల ఇల్లు
ఈ ఇంటిని పూర్తిగా మడతపెట్టి ప్యాక్ చేయవచ్చు. ఆ తరువాత దానిని ట్రక్కు ద్వారా సైట్‌కి తరలిస్తారు. అక్కడ నిపుణులు కొన్ని గంటల్లోనే ఇంటిని ఇన్‌స్టాల్ చేసి పూర్తి చేస్తారు. భవిష్యత్తులో బహుళ అంతస్తుల ఇళ్ల నిర్మాణాలు కూడా ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానున్నాయని పలు కంపెనీలు పేర్కొన్నాయి. నిజానికి ఈ విధానాన్ని ఇప్పటికే విదేశాలలో ఉపయోగిస్తున్నారు. కానీ భారతదేశంలో ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.

రూ.2 కోట్ల నిధులు అందాయి.
అప్రియర్ బిల్డ్ అనే ఈ స్టార్టప్ కంపెనీకి కునాల్ బహల్ నుంచి రూ.2 కోట్ల నిధులు అందుకుంది. దీనికి గాను కునాల్ బహల్ ఈ కంపెనీలో 2.5% ఈక్విటీని అందుకుంటారు. అనుపమ్ మిట్టల్ కూడా ఈ స్టార్టప్ పై ఆసక్తిని వ్యక్తం చేశారు. కానీ ఆయనతో చర్చల తర్వాత, ఈ స్టార్టప్ కంపెనీ కునాల్ ఆఫర్‌ను ఓకే చేసింది. భవిష్యత్తులో పెద్ద ఆర్డర్‌లు, మెరుగైన మార్జిన్‌లను ప్రదర్శించాలనే షరతుతో ఈ స్టార్టప్ కంపెనీకి కునాల్ ఆఫర్ చేసిన రూ. 2 కోట్ల నిధులు అందాయి. మొత్తం మీద ఈ అప్రియర్ బిల్డ్ ఒక కొత్త శకానికి నాంది పలికినట్లు అయ్యింది. ఈ మోడల్ విజయవంతమైతే, భారతదేశంలో గృహ నిర్మాణ టైం, ఖర్చు రెండు తగ్గుతాయి. ప్రస్తుతం ఈ స్టార్టప్ దాని తదుపరి దశకు రడీ అవుతుంది.

READ ALSO: Palash Muchhal: పరువు నష్టం దావా వేసిన స్మృతి మంధాన ఎక్స్ లవర్.. !

Exit mobile version