Site icon NTV Telugu

Affordable Smart Projector: 100-inch TV ఇప్పుడు రూ.5,000లో!

Budget Smart Projector Indi

Budget Smart Projector Indi

Affordable Smart Projector: ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో స్మార్ట్ టీవీ అనేది ఒక స్టేటస్ గుర్తుగా మారిపోయింది. అందుకని చాలా మంది ఈ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయాలని చూస్తుంటారు. ఈ స్టోరీ ఇలాంటి వారి కోసమే. ఎవరైనా ఫ్రెండ్లీ బడ్జెట్‌లో పెద్ద టీవీ కొనాలనుకుంటున్నారా? మీరు ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు విషయాన్ని పక్కన పెట్టండి.. ఇప్పుడు మీ ఇంట్లోనే థియేటర్ అనుభవాన్ని పొందవచ్చు. అది ఎలా అంటే స్మార్ట్ ప్రొజెక్టర్లను ఉపయోగించి.. ఈ స్టోరీలో స్మార్ట్ ప్రొజెక్టర్ల గురించి తెలుసుకుందాం.

READ ALSO: Pakistan: పాక్ అణ్వాయుధాలు అమెరికా చేతిలో ఉన్నాయా..? మాజీ-సీఐఏ అధికారి సంచలనం..

ఇంట్లోనే థియేటర్ అనుభవాన్ని పొందండి..
ఈ స్మార్ట్ ప్రొజెక్టర్లను ఉపయోగించి, మీ ఇంట్లోనే థియేటర్ అనుభవాన్ని పొందండి. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్‌ను ఉపయోగించి మీ ఇంట్లోని గొడను స్మార్ట్ టీవీగా మార్చవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇక్కడ లైటింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీ గది మసకగా ఉండి, గోడలు లేత రంగులో ఉంటే, మీరు ఈ ప్రొజెక్టర్‌ను ఉపయోగించవచ్చు. రూ.5 వేల కంటే తక్కువ ధర ఉన్న కొన్ని స్మార్ట్ ప్రొజెక్టర్ల గురించి తెలుసుకుందాం.

* పోర్ట్రోనిక్స్ బీమ్ 440. ఈ ప్రొజెక్టర్ 720p HD రిజల్యూషన్ నాణ్యతను అందిస్తుంది. ఇది 3W స్పీకర్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై నడుస్తుంది. దీని ధర ₹4,740.

* జీబ్రానిక్స్ ప్రొజెక్టర్ కూడా మంచి ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు. రూ.4,989 కు లభించే ఈ పరికరం విస్తృత శ్రేణి కంటెంట్‌కు యాక్సెస్‌ను అందిస్తుందని చెబుతున్నారు. కంపెనీ నివేదికల ప్రకారం.. ఈ ప్రొజెక్టర్ 100 అంగుళాల వరకు స్క్రీన్‌ను ప్రొజెక్ట్ చేయగలదని వెల్లడించారు. ఇది వివిధ OTT ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను కూడా అందిస్తుందని పేర్కొన్నారు.

* లైఫ్‌లాంగ్ స్మార్ట్ ప్రొజెక్టర్ కూడా మంచి ఎంపికగా మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. రూ.4,499 ధరకు లభించే ఈ ప్రొజెక్టర్‌పై అమెజాన్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. దీని ద్వారా మీరు 1080p రిజల్యూషన్‌లో కంటెంట్‌ను చూడవచ్చు. ఇది 3W స్పీకర్‌తో వస్తుంది.

* XElectron Techno ఒక మంచి ఎంపికగా నిపుణులు చెబుతున్నారు. ఇది అన్ని ఇతర ఎంపికలతో పాటు తాజా Android కి మద్దతు కూడా ఇస్తుందని వెల్లడించారు. దీని ధర రూ.4,990. ఇది 4K కంటెంట్‌ను ప్రసారం చేయగలదని, అలాగే దీనికి అంతర్నిర్మిత స్పీకర్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

* మీరు రూ.5 వేల కంటే తక్కువ ధరకు Wzatco Yuva Go ని కూడా పొందవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రొజెక్టర్ ధర రూ.4,999. దీని ద్వారా మీరు 4K కంటెంట్‌ను వీక్షించవచ్చు. ఈ ప్రొజెక్టర్ బ్లూటూత్‌కు కూడా మద్దతు ఇస్తుంది. అలాగే ఇది మీ ఆడియో అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని వెల్లడించారు.

READ ALSO: LIC Adani controversy: ఎల్ఐసీ–అదానీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్.. వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్‌లో నిజమెంత!

Exit mobile version