BSNL New Recharge Plans: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారుల కోసం మూడు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.172, రూ.184, రూ.190 ధరలతో ఈ ప్లాన్లను ప్రవేశపెట్టింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశాల మేరకు ఈ రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. తక్కువ ఖర్చుతో సిమ్ యాక్టివ్గా ఉంచుకోవాలనుకునే వినియోగదారులకు ఇవి ఉపయోగపడనున్నాయి.
రూ.172 ప్లాన్:
ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. అలాగే ప్రతిరోజూ 100 SMSలు ఉచితంగా పంపుకోవచ్చు. ఈ ప్లాన్ రోజువారీ సగటు ఖర్చు రూ.6.14గా ఉంటుంది. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.
రూ.184 ప్లాన్:
ఈ రీఛార్జ్లోనూ అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్తో పాటు రోజుకు 100 SMSలు అందుబాటులో ఉంటాయి. డేటా ప్రయోజనం మాత్రం ఉండదు.
రూ.190 ప్లాన్:
ఈ ప్లాన్లో నెల రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలు ఉచితంగా పొందవచ్చు. ప్లాన్ ఒక నెల వ్యాలిడిటీని కలిగి ఉంది.
ఈ మూడు ప్లాన్లలోనూ ఇంటర్నెట్ డేటా అందుబాటులో ఉండదు. కేవలం కాలింగ్, SMS ప్రయోజనాలు మాత్రమే కావాలనుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందించారు. TRAI ఆదేశాల ప్రకారం జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు కూడా డేటా అవసరం లేని వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. సాధారణంగా ఇంటర్నెట్ డేటా అవసరం లేని వారు కూడా డేటాతో కూడిన ప్లాన్లకే రీఛార్జ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఇలాంటి ప్రత్యేక ప్లాన్లతో కాలింగ్ కోసం మాత్రమే తక్కువ ధరకు రీఛార్జ్ చేసుకునే అవకాశం లభిస్తోంది. అయితే ఇంటర్నెట్ అవసరమైనప్పుడు ప్రత్యేక డేటా వోచర్లను ఉపయోగించుకోవచ్చు.

