Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే

Blaupunkt Qled Tv

Blaupunkt Qled Tv

భారతీయ వినియోగదారుల కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీ సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎస్‌పీపీఎల్ (SPPL) లైసెన్స్ కింద విడుదలైన ఈ స్మార్ట్ టీవీల ధరలు రూ.11,499 నుంచి ప్రారంభమవుతున్నాయి. 32 అంగుళాలు, 40 అంగుళాలు, 43 అంగుళాల స్క్రీన్ సైజ్‌లలో ఈ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీ సిరీస్‌లో క్వాంటం డాట్ టెక్నాలజీతో కూడిన డిస్‌ప్లేలను అందించింది. బెజెల్-లెస్ డిజైన్‌తో రూపొందించిన ఈ టీవీలు మరింత విశాలమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తాయి. QLED ప్యానెల్ కారణంగా రంగులు మరింత ప్రకాశవంతంగా, స్పష్టంగా కనిపిస్తాయి.

శక్తివంతమైన ప్రాసెసర్

ఈ సిరీస్‌లో ARM Cortex-A55 క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. టీవీలు 1GB RAM, 8GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తాయి. 32 అంగుళాల మోడల్ HD Ready రిజల్యూషన్‌ను అందిస్తే, 40 అంగుళాలు, 43 అంగుళాల మోడళ్లు Full HD రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తాయి.

×
×
Ad

కనెక్టివిటీ ఫీచర్లకు కొదవలేదు

ఈ కొత్త స్మార్ట్ టీవీల్లో Google TV 5.0 ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. Google Chromecast Built-in, Google Assistant, Bluetooth, Wi-Fi వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే మూడు HDMI పోర్టులు, రెండు USB పోర్టులు, LAN కనెక్టివిటీ కూడా అందించారు.

శక్తివంతమైన ఆడియో

ఈ టీవీల్లో 48W స్పీకర్ సిస్టమ్‌ను అందించారు. Dolby Digital Plus ఆడియో సపోర్ట్‌తో వినియోగదారులు థియేటర్ తరహా సౌండ్ అనుభవాన్ని పొందవచ్చు.

OTT యాప్‌లకు ప్రత్యేక బటన్లు

Netflix, Amazon Prime Video, YouTube వంటి ప్రముఖ OTT యాప్‌లు ముందుగానే ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి. బ్లూటూత్ రిమోట్‌లో ఈ యాప్‌ల కోసం ప్రత్యేక షార్ట్‌కట్ బటన్లు కూడా ఉన్నాయి.

ధరలు

32 అంగుళాల QLED Smart TV – రూ.11,499
40 అంగుళాల QLED Smart TV – రూ.16,499
43 అంగుళాల QLED Smart TV – రూ.17,499

ఈ అన్ని మోడళ్లు ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.