Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Best Smartphones: ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లతో ఎన్నో ప్రీమియం స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే, AI ఫీచర్లు, సాఫ్ట్వేర్ అనుభవం వంటి అంశాల్లో ప్రతి కంపెనీ ప్రత్యేకతను తీసుకవస్తుంది. Samsung, iQOO, Nothing, Motorola, OnePlus, realme లాంటి ప్రముఖ కంపెనీలు రూ.50,000 బడ్జెట్లో ఎన్నో మోడళ్లను అందిస్తున్నాయి. మరి వీటిలో ఏది తీసుకోవాలో..? మీ అవసరాలకు సరిపోయే బెస్ట్ ఫోన్ ఏదో ఒకసారి చూసేద్దామా..
iQOO 15R:
గేమింగ్, హెవీ మల్టీటాస్కింగ్ కోసం చూస్తున్న వారికి iQOO 15R అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. ఇందులో 6.83 అంగుళాల 1.5K AMOLED 144Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5 ప్రాసెసర్, 12GB RAM + 256GB స్టోరేజ్, 7,600mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా భారీ బ్యాటరీ, కూలింగ్ సిస్టమ్ వల్ల ఎక్కువసేపు గేమింగ్ చేసినా పనితీరు తగ్గదు. కాబట్టి దీనిని ఎక్కువగా గేమింగ్ లేదా పలు టాస్క్ లు చేసే వారికీ బాగా సరిపోతుంది.
Also Read
- 144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
- August 2026 Smartphone Launches: గూగుల్ పిక్సెల్ 11 నుంచి పోకో ఎం8 పవర్ వరకు.. ఆగస్టులో రానున్న కొత్త ఫోన్లు
- Tecno 0mm Bezel Smartphone: స్క్రీన్ చుట్టూ బెజెల్స్ మాయం! 0mm డిస్ప్లే బోర్డర్‌తో టెక్నో కొత్త కాన్సెప్ట్ ఫోన్
- Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
Nothing Phone (4a) Pro:
స్టాక్ ఆండ్రాయిడ్ తరహా క్లీన్ UI కోరుకునే వారికి Nothing Phone (4a) Pro మంచి ఎంపిక. ఇందులో 6.83 అంగుళాల AMOLED 120Hz డిస్ప్లే, Snapdragon 8s Gen 4 చిప్సెట్, 8GB RAM + 128GB స్టోరేజ్, 5,400mAh బ్యాటరీ ఉన్నాయి. ప్రత్యేకమైన ట్రాన్స్పరెంట్ డిజైన్, Glyph Interface ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణ. అయితే ఇందులోని బ్యాటరీ కాస్త తక్కవే.
Samsung Galaxy S25 FE:
శాంసంగ్ అభిమానులకు Galaxy S25 FE అత్యుత్తమ ఎంపిక. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.7 అంగుళాల Dynamic AMOLED 2X 120Hz డిస్ప్లే, Galaxy AI ఫీచర్లు, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, 4,900mAh బ్యాటరీ ఉన్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక సాఫ్ట్వేర్ అప్డేట్లు, ఎకోసిస్టమ్ సపోర్ట్ ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
Motorola Edge 70 Pro+:
క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని కోరుకునే వారికి Motorola Edge 70 Pro+ కూడా మంచి ఎంపిక. ఇందులో 6.7 అంగుళాల 1.5K AMOLED 144Hz డిస్ప్లే, Dimensity 8500 Extreme ప్రాసెసర్, 12GB RAM + 256GB స్టోరేజ్, 6,500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా కూడా ఆకట్టుకుంటాయి.
Realme 16 Pro+:
ఫోటోగ్రఫీ, బ్యాటరీ బ్యాకప్‌ను ఎక్కువగా కోరుకునే వారికి realme 16 Pro+ మొబైల్ మంచి ఎంపిక. ఇందులో 200MP OIS ప్రధాన కెమెరా, 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 144Hz AMOLED డిస్ప్లే, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ ఉన్నాయి. భారీ బ్యాటరీతో పాటు హై-రిజల్యూషన్ కెమెరా ఈ ఫోన్ ప్రధాన బలంగా చెప్పవచ్చు.
OnePlus Nord 6:
పనితీరు, స్టోరేజ్, బ్యాటరీ అన్నీ సమతుల్యంగా ఉండే ఫోన్ కావాలంటే OnePlus Nord 6 బెస్ట్ ఛాయస్ గా చెప్పవచ్చు. ఇందులో Snapdragon 8s Gen 4, 12GB RAM + 512GB స్టోరేజ్, 6.78 అంగుళాల 165Hz AMOLED డిస్ప్లే, 9,000mAh బ్యాటరీ, 80W SUPERVOOC ఛార్జింగ్ ఉన్నాయి. పెద్ద బ్యాటరీతో రెండు రోజుల వరకు వినియోగం అందించే సామర్థ్యం ఈ ఫోన్ ప్రత్యేకత.
Samsung Galaxy A37 5G:
శాంసంగ్ నుంచి మరో మంచి బెస్ట్ ఫోన్ Galaxy A37 5G. ఇందులో 6.7 అంగుళాల Super AMOLED 120Hz డిస్ప్లే, 8GB RAM + 256GB స్టోరేజ్, 5,000mAh బ్యాటరీ, IP68 రేటింగ్ ఉన్నాయి. ముఖ్యంగా 6 సంవత్సరాల Android OS అప్డేట్లు ఈ ఫోన్‌కు పెద్ద ప్లస్ పాయింట్.
ఎవరికి ఏ ఫోన్ బెస్ట్?
గేమింగ్‌కు: iQOO 15R.
క్లీన్ సాఫ్ట్‌వేర్‌కు: Nothing Phone (4a) Pro.
Samsung అనుభవానికి: Galaxy S25 FE.
స్టాక్ ఆండ్రాయిడ్ కోసం: Motorola Edge 70 Pro+.
కెమెరా కోసం: realme 16 Pro+.
స్టోరేజ్, బ్యాలెన్స్డ్ పనితీరుకు: OnePlus Nord 6.
దీర్ఘకాలిక సాఫ్ట్వేర్ అప్డేట్లకు: Samsung Galaxy A37 5G.
తాజావార్తలు
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
CJP: సీజేపీకి రూ.1 కోటి నిధులపై ప్రశ్నలు.. అభిజిత్ దీప్కే తండ్రి ఆర్థిక పరిస్థితిపై విచారణ కోరిన ఆర్టీఐ కార్యకర్త
-
Friendship Day 2026: ఒక బ్యాండ్.. ఎన్నో జ్ఞాపకాలు.. అసలు స్నేహితుల దినోత్సవం చరిత్ర తెలుసా?
-
Dhavaleswaram Barrage Flood: ధవలేశ్వరం బ్యారేజీకి వరద ఉధృతి.. కొనసాగుతోన్న రెండో ప్రమాద హెచ్చరిక!
-
1000 Cr Movie : 2026 సెకండాఫ్‌లో రూ. 1000 కోట్ల సినిమా ఏది? రేసులో నాలుగు సినిమాలు
ట్రెండింగ్
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!