ఇప్పటి వరకు మనకు ఎలక్ట్రికల్ కారు.. స్కూటీ, బైక్, ఆటో మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎలక్ట్రికల్ ట్రాక్టర్ కూడా రాబోతుంది. వ్యవసాయ పొలాల్లో డీజిల్ ట్రాక్టర్లే మనకు పరిచయం. కానీ ఈ-ట్రాక్టర్ కూడా త్వరలో రోడ్లపై పరిగెత్తబోతుంది. ఇండియా అంటనే వ్యవసాయ ఆధారిత దేశం. భారతదేశంలో ఎక్కువ శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తుంటారు. వ్యవసాయ పొలాలకు ఎక్కువగా ట్రాక్టర్లనే ఉపయోగిస్తుంటారు. అయితే డీజిల్ ట్రాక్టర్లతో ఖర్చు భారంగా అవుతోంది. దీంతో తక్కువ ఖర్చుతో ఈ-ట్రాక్టర్ తయారు చేసేందుకు కుబోటా, మహీంద్రా, HAV, సోనాలికా ట్రాక్టర్ కంపెనీలు సిద్ధపడుతున్నాయి. ఇందుకోసం ఎలక్ట్రానిక్ ట్రాక్టర్ నమోనాలు కూడా రెడీ చేశాయి.
AutoNxt స్టార్టప్ కంపెనీ ఎలక్ట్రికల్ ట్రాక్టర్ టెక్నాలజీపై పని చేస్తోంది. AutoNxt కంపెనీ ఈ ట్రాక్టర్ కోసం లెవల్ 3 అటానమస్ టెక్నాలజీ వాడుతున్నట్లు సీఈవో వెల్లడించారు. డ్రైవర్ లెస్ ట్రాక్టర్ టెక్నాలజీ కూడా ఈ కంపెనీలో వచ్చే ఏడాది లోపు వస్తుందని సీఈవో కౌస్తుభ్ ధోండే తెలిపారు. డీజిల్ ట్రాక్టర్ కంటే ఈ ట్రాక్టర్ తక్కువ మెయింటెనెన్స్ ఉంటుందని ధోండే పేర్కొన్నారు. డీజిల్ ట్రాక్టర్ కిలోమీటర్‌కు రూ.93 ఖర్చు అయితే.. ఈ ట్రాక్టర్ కేవలం రూ.14లు మాత్రమే ఖర్చు అవుతుందని వెల్లడించారు. అంతేకాకుండా డీజిల్ ట్రాక్టర్ల కంటే ఈ ట్రాక్టర్ల ఇంజన్ పవర్ కూడా అధికంగా ఉంటుందని తెలిపారు. ట్రాక్టర్‌ను కంపెనీ ఛార్జర్‌తో మూడు గంటల్లో ఛార్జ్ చేయవచ్చని ధోండే చెప్పుకొచ్చారు. 2025 ఆర్థిక సంవర్సరానికి 100 ఈ ట్రాక్టర్లను మార్కెట్‌లోకి తీసుకురావాలని AutoNxt కంపెనీ ప్రయత్నిస్తోంది.