Site icon NTV Telugu

Aspire 3 (2025): స్మార్ట్ ఫోన్ ధరకే న్యూ ల్యాప్ టాప్.. కేవలం రూ. 15 వేలకే

Acer Lp

Acer Lp

ప్రస్తుత రోజుల్లో ల్యాప్ టాప్, ట్యాబ్స్ వాడకం ఎక్కువైపోయింది. కంపెనీల మధ్య పోటీతో తక్కువ ధరకే ల్యాప్ టాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. బెస్ట్ ఫీచర్లతో చౌక ధరలోనే లభిస్తున్నాయి. తాజాగా టెక్ బ్రాండ్ ఏసర్ కంపెనీ స్మార్ట్ ఫోన్ ధరకే ల్యాప్ టాప్ ను తీసుకొచ్చింది. కేవలం రూ. 15 వేల ధరలోనే కొత్త ల్యాప్ టాప్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. Aspire 3 (2025) ల్యాప్‌టాప్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. స్టూడెంట్స్ కు, తక్కువ ధరలో ల్యాప్ టాప్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా ఉండనున్నది.

ఏసర్ Aspire 3 ల్యాప్‌టాప్‌లో 11.6-అంగుళాల HD కంఫీవ్యూ LED-బ్యాక్‌లిట్ డిస్‌ప్లే ఉంది. ఇంటెల్ సెలెరాన్ N4500 ప్రాసెసర్, ఇంటెల్ UHD గ్రాఫిక్స్ కార్డుతో వస్తుంది. ఇందులో 8GB DDR4 ర్యామ్ ఉంది. స్టోరేజ్ విషయానికి వస్తే.. ఇది 128GB, 256GB, 512GB లేదా 1TB PCIe NVMe SSD వంటి ఆప్షన్లలో లభిస్తుంది. వీడియో కాల్స్, ఆన్‌లైన్ మీటింగ్‌ల కోసం 720p HD వెబ్‌క్యామ్, ప్రైవసీ షట్టర్‌ ఫీచర్ ను అందించారు. స్పష్టమైన ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లు అమర్చారు.

ఇది విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ బరువు కేవలం 1 కేజీ మాత్రమే ఉంది. 38Wh Li-ion బ్యాటరీతో 8 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. బ్లూటూత్ 5.4, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, USB 3.2 Gen 1 పోర్ట్‌లు, USB టైప్-C పోర్ట్, HDMI పోర్ట్, మైక్రోSD కార్డ్ రీడర్ వంటి కనెక్టివిటీతో వస్తుంది. ధర విషయానికి వస్తే, 8GB/128GB వేరియంట్ ధర రూ.14,990, 8GB/256GB మోడల్ ధర రూ.17,990, 8GB/512GB వెర్షన్ ధర రూ.19,990గా కంపెనీ నిర్ణయించింది.

Exit mobile version