Iphone 16 Launch Event: ‘యాపిల్’ ప్రియులకు శుభవార్త.. ‘ఐఫోన్’ 16 సిరీస్ వచ్చేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple iPhone 16 Launch Event: iPhone 16 Series Launch: ప్రముఖ టెక్ సంస్థ ‘యాపిల్’.. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. సోమవారం అర్ధరాత్రి యాపిల్ పార్క్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ‘గ్లోటైమ్’ పేరిట నిర్వహించిన ఈవెంట్‌లో 16 సిరీస్ రిలీజ్ అయింది. ఐఫోన్ 16 సిరీస్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లను కంపెనీ లాంచ్ చేసింది.
ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లలో యాపిల్ ఇంటెలిజెన్స్, ఏ18 చిప్‌ను యాపిల్ కంపెనీ పరిచయం చేసింది. ఐఫోన్ 16 మరియు ప్రో మోడల్స్ రెండింటిలోనూ ఏ18 చిప్‌ను ఇచ్చారు. ఈ చిప్ రెండు రెట్లు వేగవంతమైన న్యూరల్ ఇంజిన్, 17 శాతం ఎక్కువ బ్యాండ్‌విడ్త్‌తో అప్‌గ్రేడ్ చేసిన మెమరీ సబ్‌సిస్టమ్‌ను కలిగి ఉంది. దాంతో ఐఫోన్ 15 కంటే 30 శాతం వేగవంతమైన పనితీరు ఉంటుంది.
Also Read
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
ఐఫోన్ 16 వనిల్లా వేరియంట్ 6.1 అంగుళాల డిస్‌ప్లేతో, ఐఫోన్ 16 ప్లస్ 6.7 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఐఫోన్ 16లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది . ప్రధాన కెమెరా 48 ఎంపీ. అలాగే 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ను ఇచ్చారు . 2x టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ఐఫోన్ 16 మాక్రో ఫోటోగ్రఫీకి సపోర్ట్ చేస్తుంది. దీనితో మీరు స్పేషియల్ వీడియోని క్యాప్చర్ చేయగలుగుతారు. ఐఫోన్ 16 ధర 799 డాలర్లు (రూ.67,084) కాగా.. ఐఫోన్ 16 ప్లస్ ధర 899 డాలర్లుగా (రూ.75,480) ఉంది. ఈ రెండు మోడల్స్ 128 జీబీ బేస్ మోడల్‌ను కలిగి ఉన్నాయి.
ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర 999 (రూ.83,876) డాలర్లుగా ఉంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ ప్రారంభ ధర 1199 యూఎస్ డాలర్లు (రూ.1,00,668). 16 ప్రో 128 జీబీ బేస్ మోడల్‌లో వస్తుంది. అయితే 16 ప్రో మాక్స్ బేస్ మోడల్‌లో 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. అయితే భారత్‌లో ఈ ధర ఎక్కువగా ఉంటుంది. దిగుమతి సుంకాలు, అదనపు ఖర్చుల కారణంగా భారతీయ కొనుగోలుదారులు అధిక ధర పెట్టాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!