యాపిల్ ఫోన్లకు యూత్ లో మంచి క్రేజ్ ఉంటుంది.. ఆ ఫోన్ ను కొనాలని కొనాలని అందరు అనుకుంటారు.. ఇప్పటివరకు ఈ కంపెనీ 15 ప్లస్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఇప్పుడు ఐఫోన్ 16 ఫోన్ ను త్వరలోనే లాంచ్ చెయ్యనున్నట్లు గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.. మార్కెట్లో లాంచ్ కావడానికి ముందే అనేక లీక్‌లు బయటకు వస్తున్నాయి.. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఐఫోన్ 16 ఫీచర్లకు సంబంధించి వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 16 మోడల్ పెద్ద డిస్‌ప్లేలతో రావచ్చని లీక్ డేటా వెల్లడించింది.. ఆన్ లైన్ లో లీకైనా ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
లీకైనా వివరాల ప్రకారం.. ఎల్‌టీపీఎస్ 60హెచ్‌జెడ్ అనే టెక్నాలజీని ఉపయోగించి ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ వరుసగా 6.12 అంగుళాలు, 6.69 అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉండవచ్చని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఐఫోన్ 16 ఫోన్ సైజు సాధారణ ఐఫోన్ 15 మోడల్‌ల మాదిరిగానే ఉంటాయి.. ఎటువంటి మార్పులు వస్తాయో అనేది ఇంకా తెలియలేదు.. ఐఫోన్ 16 ప్రో బ్యాటరీ ప్రోటోటైప్ ఫొటోలను వెల్లడించింది. ఈ ఫొటోలు తుషార మెటాలిక్ షెల్, బ్యాటరీ పరిమాణాన్ని ముందున్న వెర్షన్ కన్నా సుమారు 2.5 శాతం పెద్దగా ఉన్నట్టు కనిపిస్తోంది..
ఈ చిన్న మార్పు వల్ల ఫోన్ బరువు అనేది పూర్తిగా పెరగకుండా కాస్త తగ్గిస్తుంది.. థర్మల్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి, అన్ని ఐఫోన్ 16 మోడల్‌లు గ్రాఫేన్ హీట్ సింక్‌లను కలిగి ఉంటాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ హీట్ సింక్‌లు ఉష్ణ వాహకత ఫీచర్లను కలిగి ఉంటాయి.. దీని వల్ల ఫోన్ లో హీటింగ్ సమస్య రాకుండా ఉంటుందని అంచనా.. మరి ఇంక రోజుకో రూమర్స్ కాకుండా ఎలా ఫీచర్స్ తో ఐఫోన్ 16 వస్తుందో చూడాలి…