7 అంగుళాల Liquid Retina డిస్‌ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!

  • Apple HomeViewలో 7-అంగుళాల Liquid Retina డిస్‌ప్లే
  • టేబుల్‌టాప్, వాల్-మౌంటెడ్ వెర్షన్లలో అందుబాటులోకి..
  • డివైజ్‌కు A18 చిప్..
Apple Homeview

Apple Homeview

Apple HomeView Launched: యాపిల్ స్మార్ట్ హోమ్ విభాగంలో కొత్త డివైజ్‌ను పరిచయం చేసింది. ‘Welcome Home’ ఈవెంట్‌లో Apple HomeView పేరుతో సరికొత్త స్మార్ట్ హోమ్ డివైజ్‌ను ప్రకటించింది. 7 అంగుళాల Liquid Retina డిస్‌ప్లే, Siri AI, A18 చిప్, స్మార్ట్ హోమ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. హోంవ్యూను టేబుల్‌టాప్, వాల్ మౌంటెడ్ అనే రెండు వెర్షన్లలో అందిస్తోంది. భారత్‌లో రెండు మోడళ్ల ధరను రూ.39,900గా నిర్ణయించింది.

Apple HomeViewలో 7 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను అందించారు. టేబుల్‌టాప్ మోడల్ అల్యూమినియం డిజైన్, డోమ్ ఆకారంలోని స్పీకర్ బేస్‌తో వస్తుంది. డిస్‌ప్లే వ్యూయింగ్ యాంగిల్‌ను అవసరానికి అనుగుణంగా మార్చుకునేందుకు స్టెయిన్‌లెస్ స్టీల్ హింజ్‌ను ఇచ్చారు. వాల్-మౌంటెడ్ వెర్షన్‌ను ఇంటి ప్రవేశ ద్వారాలు, హాల్‌వేలు వంటి ప్రాంతాల్లో అమర్చుకోవచ్చు. డిస్‌ప్లేలో “ట్రూ టోన్” టెక్నాలజీ ఉండటంతో పరిసరాల్లోని వెలుతురుకు అనుగుణంగా స్క్రీన్ మారుతుంది. అడాప్టివ్ బ్రైట్‌నెస్ 500 నిట్స్ నుంచి 0.3 నిట్స్ వరకు సర్దుబాటు అవుతుంది. అంతేకాకుండా యూజర్ డిస్‌ప్లేకు దూరంగా ఉన్నప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని సింపుల్‌గా చూపించే ఇంటర్‌ఫేస్, దగ్గరకు వచ్చినప్పుడు మరిన్ని వివరాలను చూపించే అడాప్టివ్ ఇంటర్‌ఫేస్‌ను అందించారు.

ఆపిల్ హోమ్ వ్యూ ఒకే ఇంట్లో గరిష్ఠంగా ఆరుగురు వ్యక్తులకు పర్సనలైజ్డ్ అనుభవాన్ని అందిస్తుంది. ప్రతి ఒక్కరికీ ప్రత్యేక హోమ్ స్క్రీన్, యాప్స్, విడ్జెట్స్ ఉంటాయి. అదే సమయంలో షేర్డ్ ఫొటోలు, మ్యూజిక్ వంటి కంటెంట్‌ను కుటుంబ సభ్యులతో పాటు గెస్ట్‌లు కూడా యాక్సెస్ చేయవచ్చు. ఇందులో ఆపిల్ ఇంటలిజెన్స్ ఆధారిత Siri AIను అందించారు. సహజమైన సంభాషణలు, సాధారణ ప్రశ్నలకు సమాధానాలు, మ్యూజిక్ డిస్కవరీతో పాటు స్క్రీన్‌పై కనిపిస్తున్న సమాచారాన్ని అర్థం చేసుకొని స్పందించే సామర్థ్యం దీనికి ఉంటుంది. ఆపిల్ ఇంటలిజెన్స్ సపోర్ట్ చేసే ఐఫోన్ లేదా ఐప్యాడ్‌తో హోమ్ వ్యూ ను కనెక్ట్ చేస్తే కేలండర్, మెసేజెస్ వంటి యాప్స్‌లోని వ్యక్తిగత సందర్భాన్ని ఆధారంగా చేసుకొని సిరి సహాయం అందిస్తుంది. వివిధ యాప్స్‌లో పనులు చేయడంతో పాటు ఆపిల్ మ్యూజిక్ ప్లేలిస్టులను కూడా రూపొందించగలదు. సిరి మాట్లాడే విధానం, వేగాన్ని అనుకూలమైన పెయిర్డ్ డివైజ్ ద్వారా మార్చుకోవచ్చు. iCloud ద్వారా సిరి సంభాషణల హిస్టరీ సపోర్టెడ్ ఆపిల్ డివైజ్‌ల మధ్య సింక్ అవుతుంది.

హోమ్ వ్యూ డిస్‌ప్లేను యూజర్లు తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫొటోస్ ఫేస్ ద్వారా వ్యక్తిగత ఫొటోలు, షేర్డ్ ఆల్బమ్స్‌ను చూపించవచ్చు. పోర్ట్రైట్ తరహా డెప్త్ ఎఫెక్ట్‌తో ప్రధాన వ్యక్తి లేదా వస్తువును స్పష్టంగా ఉంచుతూ ఫోర్‌గ్రౌండ్, బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేస్తుంది. ‘ఫ్లో’ ఫేస్ యూజర్ కదలికలు, సమీపంలో ఉన్నారో లేదో గుర్తించి స్పందిస్తుంది. ‘స్నూపీ’ ఫేస్ సమయం, వాతావరణం, క్రీడలు, పండుగలకు అనుగుణంగా వివిధ యానిమేషన్లను ప్రదర్శిస్తుంది.

టేబుల్‌టాప్ హోమ్ వ్యూలో డిస్‌ప్లే భాగంలో రెండు కస్టమ్ ఫుల్-రేంజ్ డ్రైవర్లు ఉన్నాయి. స్పీకర్ బేస్‌లో డౌన్-ఫైరింగ్ వూఫర్‌తో పాటు రెండు ఫోర్స్-క్యాన్సిలింగ్ పాసివ్ రేడియేటర్లను అందించారు. ఆపిల్ సిలికాన్, రియల్‌టైమ్ సెన్సర్ల సహాయంతో వివిధ వాల్యూమ్ స్థాయిలకు అనుగుణంగా సౌండ్, బాస్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. స్పటిల్ ఆడియోకు కూడా సపోర్ట్ ఉంది. వాల్-మౌంటెడ్ వెర్షన్‌లో రెండు కస్టమ్ డ్రైవర్లతో పాటు గోడపై అమర్చినప్పుడు మెరుగైన సౌండ్ అందించేలా కంప్యూటేషనల్ ఆడియోను ట్యూన్ చేశారు. ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ పాడ్కాస్ట్స్, ఆపిల్ న్యూస్, ఆపిల్ టీవీతో పాటు అనుకూలమైన థర్డ్ పార్టీ ఆడియో, వీడియో యాప్స్‌కు హోమ్ వ్యూ సపోర్ట్ చేస్తుంది.

HomeView ద్వారా అనుకూలమైన సెక్యూరిటీ కెమెరాలు, థర్మోస్టాట్స్, లైట్లు, డోర్లు, బ్లైండ్స్ వంటి స్మార్ట్ హోమ్ పరికరాలను టచ్ లేదా Siri ద్వారా కంట్రోల్ చేయవచ్చు. Home Modular ఫేస్‌లో ఫేవరెట్ యాక్సెసరీస్‌ను వేగంగా యాక్సెస్ చేయవచ్చు. హోమ్ కెమెరా ద్వారా ఒకేసారి గరిష్ఠంగా తొమ్మిది లైవ్ కెమెరా ఫీడ్స్‌ను చూడవచ్చు. అనుకూలమైన కెమెరాలు, అవసరమైన iCloud+ సబ్‌స్క్రిప్షన్ ఉన్నప్పుడు వ్యక్తులు, తెలిసిన ముఖాలు, పెంపుడు జంతువులు, ప్యాకేజీలు, వాహనాలను గుర్తించే ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. హోమ్ కిట్ సెక్యూర్ వీడియో ఫుటేజ్‌కు వీడియో వివరణలను కూడా అందిస్తుంది. పొగ లేదా కార్బన్ మోనాక్సైడ్ అలారమ్ శబ్దాలను గుర్తించి iPhone, iPad లేదా Apple Watchకు అలర్ట్స్ పంపగలదు.

Apple HomeViewలో A18 చిప్ ను ఉపయోగించారు. కెమెరా, మైక్రోఫోన్ డేటాను మిగతా సిస్టమ్ నుంచి వేరుగా ప్రాసెస్ చేసేందుకు సెక్యూర్ ఎక్సక్లేవ్స్, ప్రొటెక్టెడ్ రన్‌టైమ్స్‌ను ఉపయోగిస్తున్నట్లు యాపిల్ తెలిపింది. యూజర్ ముఖాన్ని గుర్తించడంతో పాటు పెయిర్ చేసిన iPhone లేదా iPad సమీపంలో ఉండి ఇటీవల అన్‌లాక్ చేసినప్పుడు మాత్రమే Messages, Calendar వంటి వ్యక్తిగత సమాచారాన్ని చూపిస్తుంది. Siri రిక్వెస్టులను డివైజ్‌లోనే లేదా Private Cloud Compute ద్వారా ప్రాసెస్ చేస్తుంది. టేబుల్‌టాప్, వాల్-మౌంటెడ్ వెర్షన్లు రెండింటి ధర భారత్‌లో రూ.39,900గా ఉంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, అమెరికాలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. నవంబర్ 13 నుంచి అందుబాటులోకి రానుంది. ఆలాగే టేబుల్‌టాప్ వెర్షన్ సిల్వర్, స్టార్‌లైట్, రోజ్ పింక్, స్పేస్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వాల్-మౌంటెడ్ మోడల్ స్పేస్ గ్రే, సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. Schneider Electric Power Mount USB-C Wall Connector ధర రూ.6,900, Power Mount AC Wired ధర రూ.8,900గా ఉంది. Power Mount PoE Wired ధర రూ.14,900 కాగా, ఇది 2027 ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.