Anthropic: ల్యాప్‌టాప్ అవసరం లేదు, మొబైల్లోనే ఆఫీస్ వర్క్.. ఆంథ్రోపిక్ సూపర్ యాప్..
- ఇక ల్యాప్‌టాప్ అక్కర్లేదు, మొబైల్లోనే ఆఫీస్ వర్క్..
- క్లాడ్‌లో సూపర్ అప్డేట్ తెచ్చిన ఆంథ్రోపిక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anthropic: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రాకతో టెక్నాలజీ వేగంగా మారుతోంది. మానవ జీవితం ఏఐతో మరింత సులభతరం అవుతోంది. తాజాగా ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్(Anthropic) తన “క్లాడ్” మొబైల్ యాప్‌లో కీలక అప్డేట్ తీసుకువచ్చింది. దీని ద్వారా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ అవసరం లేకుండానే మొబైల్ ద్వారా అనేక వర్క్ టూల్స్ ఉపయోగించి ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు. ఈ కొత్త అప్డేట్ తో క్లాడ్ యాప్‌లోనే ఫిగ్మా, కాన్వా లాంటి యాప్‌లను ఉపయోగించుకోవచ్చు. క్లాడ్ యాప్ నుంచి బయటకు వెళ్లకుండా వీటిని యాక్సె్స్ చేయవచ్చు. ఒకే యాప్‌లో డిజైన్, ప్రజెంటేషన్, డేటా చెక్ ఇలా అన్ని పనులు చేసుకోవచ్చు.
Read Also: West Bengal Elections: మమతా బెనర్జీ ఇలాఖాలో బీజేపీ ‘‘శ్రీరామ నవమి’’ ర్యాలీ..
Also Read
- Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
- Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
సింపుల్ టెక్ట్స్ కమాండ్ ద్వారా పనులు చేసుకోవచ్చు. ఉదాహరణకు క్లాడ్ యాప్‌లో కాన్వాలో ప్రెజెంటేషన్ తయరు చేయి అని కమాండ్ ఇస్తే, ఆ పని చేసిపెడుతుంది. ఒక్క చాట్‌తో ఆదేశిస్తే చిటికెలో పనులు పూర్తవుతాయి. ఈ అప్డేట్తో క్లాడ్ సూపర్ యాప్‌గా మారుతోంది. ఇది కేవలం చాట్‌బాట్‌లా కాకుండా పూర్తి వర్క్ ప్లాట్ఫార్మ్గా మారుతోంది. అంటే, ఒకే యాప్‌లో డిజైన్, ప్రెజెంటేషన్, డేటా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మొబైల్ ద్వారా చక్కబెట్టవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాట్‌జీపీటీ వంటి వాటికి ఆంథ్రోపిక్ సవాల్ విసురుతోంది.
ఆంథ్రోపిక్ త్వరలో ‘ఆర్బిట్’ అనే కొత్త ఫీచర్ తీసుకురావాలని భావిస్తోంది. దీని ద్వారా కాల్స్ చేయడం, మెసేజ్ చేయడం, క్యాలెండర్ ఈవెంట్స్ సెట్ చేయడం, బ్రౌజర్ పనులు చేయడం వంటికి చేయగలుగుతారు. ఇవన్నీ క్లాడ్ ద్వారా ఆటోమెటిక్‌గా చేసుకునే అవకాశం ఏర్పడింది. క్లాడ్ మొబైల్ అప్డేట్ పని విధానాన్ని పూర్తిగా మారుస్తోంది. ఇకపై ల్యాప్ లాప్ అవసరం లేకుండా మొబైల్ తో పనులు చేయవచ్చు. ఆంత్రోపిక్ మొబైల్ ప్రొడక్ట్ మేనేజర్ రాబర్ట్ బాయ్.. భవిష్యత్తులో క్లాడ్ యాప్ కోసం తమ వద్ద చాలా ఉన్నాయని, రాబోయే రోజుల్లో మొబైల్ యాప్‌లో మరెన్నొ గొప్ప విసయాలు రాబోతున్నాయని చెప్పారు.
My first full 0-1 feature ship since joining Anthropic is live!
So many more great things coming to the mobile app in the coming weeks as well. Let us know your thoughts! https://t.co/rKEUuqVSQG
— Robert Bye (@RobertJBye) March 25, 2026
తాజావార్తలు
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్‌షాక్.. తుది జట్టులో దొరకని స్థానం.. కారణం ఇదే..
-
Actor Raghu Karumanchi: దీవానా నా రియల్ స్టోరీ
-
Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?