రియల్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్ రాబోతుంది.. ఈ ఫోన్ ఫీచర్స్ మాములుగా లేవని తెలుస్తుంది.. ఈ కొత్త హ్యాండ్‌సెట్‌ను కంపెనీ సి-సిరీస్ కింద మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ వియత్నాంలో విడుదల చేసింది.. ఇక అతి త్వరలోనే భారత్ మార్కెట్ లో విడుదల చెయ్యనున్నారు.. మరి ఫీచర్స్, ధర ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ కొత్త ఫోన్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో 6.67 అంగుళాల డిస్ప్లే ను కలిగి ఉంటుంది.. MediaTek Helio G85 ప్రాసెసర్ లభిస్తుంది.. అలాగే ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఓస్ తో పనిచేస్తుంది.. అలాగే ఇది 8GB RAM+8GB వరకు వర్చువల్ RAM మద్దతుతో లభిస్తుంది. అంతేకాదు ఫోన్‌లో 256GB వరకు స్టేరేజ్ ఉంటుంది. డ్యూయల్ సిమ్ ను కలిగి ఉంటుంది.. ఇక కెమెరా విషయానికొస్తే… 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా కలిగి ఉంది. ఇది AI- పవర్డ్ లెన్స్‌తో అమర్చబడి ఉంటుంది. సెల్ఫీలు, వీడియోల కోసం ఇది 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.. ఇంకా ఎన్నో ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి..
ధర విషయానికొస్తే.. ఈ కొత్త ఫోన్ ధర విషయానికొస్తే.. 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,000గా ఉంది. 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,000, 8GB/256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,000 గా ఉంది.. రెండు వేరియంట్లలో రాబోతుంది.. ఫ్రీ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.. మీకు నచ్చితే మీరు కూడా బుక్ చేసుకోండి..
