NTV Telugu Site icon

Airtel: బంపరాఫర్.. రోజుకు 3GB డేటా, ఫ్రీగా అమెజాన్ ప్రైమ్

Airtel

Airtel

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులకు సర్ ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. తద్వారా తాను కోల్పోయిన కస్టమర్లతో పాటు కొత్త వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది ఎయిర్టెల్. తాజాగా ఎయిర్టెల్ మరో సంచలన ఆఫర్ తీసుకువచ్చింది. మరి లేట్ ఎందుకు ఆ ఆఫర్ వివరాలు చూసేద్దామా.

స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నాటి నుంచి డేటా వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. వినియోగదారులు సైతం ఎక్కువగా డైలీ డేటా అందించే ప్లాన్ల కోసం వెతుకుతున్నారు. కరోనా నేపథ్యంలో విధించిన వర్క్ ఫ్రం హోం కారణంగా మొబైల్ డేటా వినియోగం ఇంకా అధికమైంది. అయితే ఇదేక్రమంలో మొబైల్ డేటా ఎక్కువగా వినియోగించే వారి కోసం ఎయిర్టెల్ తీసుకువచ్చిన బెస్ట్ ప్లాన్ Airtel Rs.699.

ఈ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులకు నిత్యం 3 జీబీ డైలీ డేటా లభిస్తుంది. ఇంకా అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. నిత్యం 100 SMS లు సైతం లభిస్తాయి. దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం సైతం ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. అంటే.. దాదాపుగా రెండు నెలలు అన్నమాట. వ్యాలిడిటీ ముగిసే వారకు వినియోగదారులు నిత్యం 3 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు, అమెజాన్ ప్రైమ్ సబ్క్రిప్షన్ ను ఎంజాయ్ చేయవచ్చు.