NTV Telugu Site icon

AI : అంధులు కోసం ప్రత్యేక కళ్లజోడు..ఏ వస్తువునైనా చూడొచ్చు..!

Ai Speds

Ai Speds

ప్రస్తుతం ఎక్కడ విన్నా ఒక్కటే మాట AI.. రోజు రోజుకు అద్భుతాలను చూపిస్తున్నాయి.. పలు రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) చేస్తున్న అద్భుతాలు.. అన్నీ ఇన్నీ కావు.. తాజాగా మరో అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పింది.. తాము ఎప్పటికి చూడలేమని నిరాశలో ఉన్న అంధులకు వరంగా మారింది.. వారికి ప్రపంచాన్ని చూపిస్తుంది.. అంధులు, దృష్టి లోపం ఉన్నవారి కోసం తయారు చేసిన ఏఐ ఆధారిత పరికరాలు వైద్యరంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాయి..ఏఐ సాంకేతికతతో పనిచేసే ‘స్మార్ట్‌ విజన్‌’ అనే పరికరాన్ని అమర్చిన కంటిఅద్దాల్ని ఇటీవల హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్‌ కంటి దవాఖానలో 50 మందికి పంపిణీ చేశారు.

వీటి సాయంతో అంధులు ఏ వస్తువునైనా చూడొచ్చు. సందేశాల్ని చదవొచ్చు. నడుస్తుండగా అడ్డొచ్చేవాటిని, ఎదుటి వ్యక్తుల్ని గుర్తించవచ్చు. మల్టీ టాస్కింగ్‌ను ఏకకాలంలో చేపట్టేందుకు ‘స్మార్ట్‌ విజన్‌’లో పలు సెన్సార్లను అమర్చారు. రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీతో ఇది త్రీడీ ఇమేజ్‌లను సృష్టిస్తుంది.. వీటిలో బ్లూటూత్‌, మైక్రోఫోన్‌, స్పీకర్‌ను ఏర్పాటుచేశారు. దీన్ని ఏఐ అప్లికేషన్‌కు అనుసంధానం చేస్తారు. దాంతో కృత్రిమ మేధ సేవలు అంధులకు అందుబాటులోకి వస్తాయి. బ్రెయిలీ లిపిలో ఉన్న బటన్స్‌ను నొక్కటం ద్వారా లేదా వాయిస్‌ కమాండ్స్‌ ఇవ్వటం ద్వారా స్మార్ట్‌ విజన్‌ సేవల్ని పొందుతారు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ‘విజన్‌ ఏయిడ్‌’ వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో 2021లో పైలట్‌ ప్రాజెక్ట్‌ చేపట్టారు.

ఇది ఫేస్‌ రికగ్నేషన్‌, మనుషుల భావాలు, చుట్టుపక్కల ఉండే వాహనాలు, వస్తువులు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, జీబ్రా క్రాసింగ్‌ లైన్స్‌.. మొదలైనవి పసిగట్టే మెషిన్‌ లెర్నింగ్‌తో ఏఐని రూపొందించారు.. ఇది పలు భాషల్లో మనుషులతో మాట్లాడుతుంది.. వాస్తవానికి ఈ పరికరం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అంధులతో మాట్లాడుతుంది.. ఈ పరికరం ఎలా పనిచేస్తుందంటే..

ఫీచర్లు..

ప్రింట్‌ చేసిన, రాసిన అక్షరాల్ని వివిధ భాషల్లో చదివి వినిపిస్తుంది.
అలాగే ‘స్మార్ట్‌ విజన్‌’కు అంధులు వాయిస్‌ కమాండ్స్‌ కూడా ఇవ్వొచ్చు.
ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు.. అలర్ట్‌ బటన్‌తో బంధువులకు సమాచారం పంపొచ్చు… ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ పరికరం కు మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే..