రిలయన్స్ జియో దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటి. 2024 జూలైలో జియో తన టారిఫ్‌లను పెంచినప్పటికీ, ఇప్పటికీ సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా తమ ప్లాన్ల ధరలను పెంచినా.. జియో యూజర్లకు అందించే కొన్ని ప్లాన్లు ఇంకా తక్కువ ధరలో మంచి సేవలను అందిస్తాయి. అపరిమిత 5G డేటా, కాలింగ్ వంటి సౌకర్యాలను అందించే రిలయన్స్ జియో.. మూడు సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.
జియో రూ. 349 రీఛార్జ్ ప్లాన్
జియో రూ. 349 రీఛార్జ్ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో 2GB 4G డేటా అందుబాటులో ఉంది. ఈ నెలవారీ రీఛార్జ్ ప్లాన్‌లో కస్టమర్‌లు తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్‌లో కస్టమర్ టెలికాం కంపెనీ నుండి ఆశించే దాదాపు అన్ని ప్రయోజనాలను పొందుతాడు. ఎక్కువ సెల్యులార్ డేటా అవసరమయ్యే వినియోగదారులకు ఇది బెస్ట్ రీఛార్జ్ ఎంపిక.
జియో రూ. 749 రీఛార్జ్ ప్లాన్
జియో రూ. 749 రీఛార్జ్ ప్లాన్ చెల్లుబాటు 72 రోజులు. ఈ ప్లాన్‌లో అపరిమిత 5G డేటా, కాలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ రీఛార్జ్‌లో ప్రతిరోజూ 2GB 4G డేటా లభిస్తుంది. అంతే కాకుండా.. మొత్తం చెల్లుబాటు కోసం ఈ ప్లాన్‌లో 20GB అదనపు డేటా అందుబాటులో ఉంది. జియో 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాలలో, వినియోగదారులు అపరిమిత 5G ఇంటర్నెట్‌ను పొందవచ్చు.
జియో రూ. 3,599 రీఛార్జ్ ప్లాన్
జియో రూ. 3,599 రీఛార్జ్ ప్లాన్ చెల్లుబాటు 365 రోజులు. ఇది అపరిమిత 5G డేటా సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో రిలయన్స్ జియో కస్టమర్లు ప్రతిరోజూ 2.5GB 4G డేటాను పొందుతారు. తరచుగా రీఛార్జ్ చేసుకునే టెన్షన్ అక్కర్లేని వారికి ఈ ప్లాన్ సరైనది.