తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తల్లిదండ్రులు దివంగత నారా అమ్మణమ్మ, నారా కర్జూర నాయుడు సమాధుల వద్ద ప్రముఖ సినీనటుడు నారా రోహిత్ నిరసన తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వైసీపీ ముష్కరమూకలు చేసిన మానసిక దాడికి నిరసనగా రోహిత్ తమ పూర్వీకుల సమాధుల వద్ద నివాళులర్పించి బైఠాయించారు. తమ పెదనాన్న చంద్రబాబునాయుడు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు నారా లోకేష్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి యావత్ తెలుగుదేశం పార్టీ కేడర్…