వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పసుపు రంగు మిర్చి (Yellow Chilli) సరికొత్త రికార్డును సృష్టించింది. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ మార్కెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా, పసుపు మిర్చి ధర క్వింటాల్‌కు ఏకంగా ₹44,000 పలికిందని అధికారులు వెల్లడించారు. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఈ ధర భారీగా పెరగడం గమనార్హం. నిన్నటి వరకు క్వింటాల్ ధర ₹42,500 ఉండగా, నేడు అది మరో ₹1,500 పెరిగి…