ఉత్తర తెలంగాణలో ప్రస్తుతం వనకాలం సీజన్‌లో నిలిచిన పంటలకు సాగునీటి అవసరాలు తీర్చేందుకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సిద్ధమైంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు మినహా, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్ సహా అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, నీటి వనరులకు సరైన ఇన్ ఫ్లో రాలేదు. వాటి పరివాహక ప్రాంతాలలో వాగులతో పాటు, LMD , MMD…