పిల్లలకు జలుబు, దగ్గు వంటి సమస్యలు రావడం చాలా సాధారణం. ఈ సమస్యల సమయంలో కొంతమంది పిల్లలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. అటువంటి సందర్భాల్లో డాక్టర్ల సలహా మేరకు నెబ్యులైజర్‌ను ఉపయోగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే నెబ్యులైజర్‌ను ఎప్పుడు పెట్టాలనే విషయంలో తల్లిదండ్రులు చాలాసార్లు గందరగోళానికి గురవుతుంటారు. సాధారణంగా పిల్లలకు జలుబు, దగ్గు వచ్చినప్పుడు శ్వాసలో ఇబ్బంది, గురక, వీజింగ్ (శ్వాస తీసుకునే సమయంలో శబ్దం రావడం) వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్…