విశాఖలోని శారదా పీఠం వద్ద మంత్రి అప్పలరాజుకు అవమానం ఎదురైంది. శారదా పీఠం వార్షికోత్సవం సందర్భంగా సీఎం జగన్ విశాఖ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి అప్పలరాజుతో పాటు పలువురు వైసీపీ నేతలు శారదా పీఠం వద్దకు చేరుకున్నారు. సీఎం రాక సందర్భంగా శారదాపీఠంలోకి మంత్రి అప్పలరాజు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ఒక్కరే లోపలకు వెళ్లాలని, అనుచరులను లోపలకు పంపించబోమని సీఐ స్పష్టం చేశారు. Read Also: Bonda Uma: సీఎం జగన్ ఇంటిని…
విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి మంగళవారం మధ్యాహ్నం నాడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విశాఖలోని శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ శారదా పీఠం వార్షిక మహోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్‌ను స్వాత్మానందేంద్ర సరస్వతి ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను సీఎం జగన్‌కు అందజేసి శాలువా కప్పి వేదాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో…