విజయవాడలో రిటైర్డ్ ఇంజినీర్‌ను దారుణంగా హత్య చేశారు. ఇంట్లో పని మనిషే మాటు వేసి చంపేసింది. వృద్ధులు ఉన్నారని ప్లాన్ చేసి మరీ హత్య చేసింది. బంగారం, డబ్బుతో ఉడాయించింది. నగరం నడిబొడ్డున జరిగిన ఈ హత్య బెజవాడలో కలకలం సృష్టిస్తోంది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వెంకట రామారావు. రోడ్లు భవనాల శాఖలో ఇంజినీర్‌గా పని చేసి రిటైరయ్యారు. ప్రస్తుతం విజయవాడ NTR కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈయనతో పాటు ఆ ఇంట్లో తల్లి…