Vicky Jain: బాలీవుడ్ నటి అంకిత లోఖండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దివంగత స్టార్ హీరో సుశాంత్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలిగా ఆమెకు మంచి పేరు ఉంది. ఇక అంకిత.. సుశాంత్ తో బ్రేకప్ చెప్పాకా.. సీరియల్ హీరో విక్కీ జైన్ తో ప్రేమలో పడింది. గతేడాది అతడినే వివాహమాడింది. ఇక ఈ జంట.. హిందీ బిగ బాస్ సీజన్ 17 లో అడుగుపెట్టారు.