భారత అండర్-19 జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 2026 ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బెనోనీ లోని విల్లోమూర్ పార్క్‌లో జరిగిన రెండో యూత్ వన్డేలో మెరుపు ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి.. యూత్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయుష్ మాథ్రే గైర్హాజరీలో భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా…