Bangladesh: భారత వ్యతిరేకి, ఉగ్రసంస్థ ‘‘ఉల్ఫా’’ చీఫ్ పరేష్ బారుహ్ మరణశిక్షను బంగ్లాదేశ్ కోర్టు రద్దు చేసింది. 2004 ఛటోగ్రామ్ ఆయుధ రవాణా కేసులో బంగ్లాదేశ్ మాజీ మంత్రి లుత్ఫోజామన్ బాబర్‌తో సహా మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. నిషేధిత ఉగ్ర సంస్థ చీఫ్ పరేష్ బారుహ్ మరణశిక్షని జీవితఖైదుకు తగ్గించినట్లు బంగ్లా మీడియా తెలియజేసింది.