తుని నియోజకవర్గం ఒకప్పుడు టిడిపికి కంచుకోట. ఈ నియోజకవర్గంలో 2009లో తొలిసారి యనమల రామకృష్ణుడు ఓడిన తర్వాత పరిస్థితి మారిపోయింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో యనమల తమ్ముడు కృష్ణుడు బరిలో ఉన్నప్పటికీ టీడీపీకి ఓటమి తప్పలేదు. ఇప్పుడు యనమల దృష్టంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఉంది. గత వారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో నర్మగర్భంగా తన మనసులో మాట చెప్పేసారు యనమల. యువతకు 40 శాతం సీట్లు కేటాయిస్తేనే గెలుస్తామని టీడీపీ అధినేతకు చెప్పానన్నారు. ఎప్పుడూ…