ఆ నియోజకవర్గంలో ప్రభుత్వ పథకం అధికారపార్టీలో చీలిక తెచ్చిందా? వర్గపోరు బయటపడిందా? ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ విభేదాలను మరో అంకానికి తీసుకెళ్లాయా? ఏంటా నియోజకవర్గం? ఎవరా ఎమ్మెల్యే? బీసీ, కాపు సామాజికవర్గాల మధ్య ఆధిపత్యపోరు..!సైలెంట్ రాజకీయాలకు పెట్టింది పేరైన తణుకులో ప్రస్తుతం రాజకీయం వాడీవేడిగా ఉంది. అదీ అధికార వైసీపీలో కావడంతో మరింత అటెన్షన్ వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు. ఈ నియోజకవర్గంలో బీసీ, కాపు సామాజికవర్గాల మధ్య ఆధిపత్యపోరు ఉంది. ఆ సమస్య పెద్దగా…