(అక్టోబర్ 1న రమణారెడ్డి శతజయంతి) కట్టెపుల్లకు బట్టలు తొడిగినట్టుగా ఉండే రూపంతో చూడగానే ఇట్టే నవ్వులు పూయించేవారు రమణారెడ్డి. క్షణాల్లో ముఖంలో అనేక భావాలు పలికించి రమణారెడ్డి నవ్వించిన తీరును తెలుగువారు మరచిపోలేరు. రమణారెడ్డి నటించిన చిత్రాలు ఇప్పటికీ బుల్లితెరపై దర్శనమిస్తూనే ఉంటాయి. ఆయన నటన చూసి నవతరం ప్రేక్షకులు సైతం పడి పడి నవ్వుతూ ఉండడం చూస్తూనే ఉంటాం. అదీ రమణారెడ్డి నవ్వుల మహాత్యం అనిపిస్తుంది. రమణారెడ్డి పూర్తి పేరు తిక్కవరపు వెంకటరమణారెడ్డి. 1921 అక్టోబర్…