జాకీ చాన్ ‘ద మిత్’ చూసిన వారెవరికైనా అందులో ఆయన అభినయం గిలిగింతలు పెట్టక మానదు. ‘ద మిత్’ కథ ఆధారంగానే రాజమౌళి తన ‘మగధీర’ సినిమాలో కొంత భాగం రూపొందించారని అందరికీ తెలుసు. 2005లో బ్లాక్ బస్టర్ గా నిలచిన ‘ద మిత్’కు దాదాపు 18 ఏళ్ళ తరువాత సీక్వెల్ తెరకెక్కించాలని భావిస్తున్నారు. దర్శకుడు స్టాన్లీ టాంగ్ రూపొందించిన ‘ద మిత్’ అప్పట్లో 15 మిలియన్ డాలర్లతో రూపొంది, మంచి లాభాలు చూసింది. ఈ నేపథ్యంలోనే…