Thailand-Cambodia: థాయిలాండ్, కంబోడియాల మధ్య ఘర్షణ తీవ్రమవుతోంది. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ముదిరింది. ఇరు దేశాలు కూడా రాకెట్లు, యుద్ధ విమానాలో దాడులు చేసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య ‘‘ప్రీహ్ విహార్’’అనే 1000 ఏళ్ల నాటి హిందూ ధర్మానికి చెందిన శివాలయం ఘర్షణలకు కేంద్రంగా ఉంది. దీని కోసం రెండు దేశాలు గత కొన్నేళ్లుగా ఘర్షణకు దిగుతున్నాయి.