ప్రముఖ రచయిత, కాలమిస్ట్ ఇలపావులూరి మురళీమోహన రావు ఆదివారం అర్థరాత్రి కన్నుమూశారు. ఎనిమిది సినిమాలకూ రచన చేసిన ఆయన దాదాపు 200 కథలు, 750 వ్యాసాలు రాశారు.
(సెప్టెంబర్ 19న తాపీ ధర్మారావు జయంతి) చూడక నమ్మినవారు ధన్యులు అంటారు. కానీ, చూస్తేనే కదా అసలు విషయం తెలిసేదని వాదించేవారూ ఘనులే. హేతువును అన్వేషించడంలోనే ఆనందించేవారు ఇలాంటి ఘనులు. ఆ కోవకు చెందినవారు సుప్రసిద్ధ రచయిత తాపీ ధర్మారావు. తెలుగునేలపై హేతువాదులుగా పేరొందిన రచయితల్లో ధర్మారావు స్థానం ప్రత్యేకమైనది. ఆయన ముక్కుసూటి తనం చాలామందికి నచ్చక పోవచ్చు. కానీ, ఆయన కలం బలం తెలిసినవారు మాత్రం ధర్మారావును అభిమానించకుండా ఉండలేరు. ప్రతీ విషయానికీ ఏదో ఒక…
(సెప్టెంబర్ 12 మల్లాది రామకృష్ణ శాస్త్రి వర్ధంతి) ‘తేనెకన్నా తీయనిది తెలుగు భాష’ అన్న మాట చిన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నాం. ఆ తీయదనానికి మరింత తీపు అద్దినవారు మల్లాది రామకృష్ణ శాస్త్రి. ఆయన రచనలు పాఠకులకు మధురానుభూతులు, శ్రోతలకు వీనులవిందు చేశాయి. అందుకే జనం మల్లాదివారి సాహిత్యం చదివి ‘సాహో… మల్లాది రామకృష్ణ శాస్త్రీ’ అన్నారు. సినిమా రంగంలో ప్రవేశించే నాటికే మల్లాది రామకృష్ణ శాస్త్రి కలం బలం చూపిన రచయిత. స్వస్థలం బందరులో బి.ఏ,,…