అనేక తెలుగు చిత్రాలలో అక్క, వదిన, పిన్ని, అత్త, అమ్మ పాత్రల్లో ఒదిగిపోతూ అందరినీ అలరించారు నటి సురేఖా వాణి. ఇప్పటికీ పలు చిత్రాలలో సురేఖ కేరెక్టర్ రోల్స్ లో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వర్ధమాన తారల చిత్రాలలో సురేఖా వాణి ఏదో ఒక పాత్రలో తప్పకుండా కనిపిస్తూ ఉంటారు. తనదైన అభినయంతో ఆకట్టుకుంటూ సురేఖ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. సురేఖా వాణి 1977 ఏప్రిల్ 29న విజయవాడలో జన్మించారు. చిన్నతనం నుంచీ సురేఖ…