Telangana Formation Day: రాష్ట్ర వ్యాప్తంగా ఆంగరంగ వైభవంగా జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. రాష్ట్రం నలువైపుల నుంచి వచ్చిన కళాకారులు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే స్టాళ్లు.. హుస్సేన్‌సాగర తీరాన లేజర్‌షోతో విరజిమ్మిన వెలుగులు.. భారీగా తరలివచ్చిన ప్రజలు, డప్పు విన్యాసాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు మార్మోగిపోయాయి. విద్యుత్ కాంతులతో సచివాలయం, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలు గంటన్నరపాటు కొనసాగాయి. అమరవీరులకు నివాళులర్పిస్తూ పాడిన ‘వీరుల్లారా…