విద్యార్థులు, విద్యా విధానంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది కరోనా మహమ్మారి.. స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు మూతపడి.. ఆన్‌లైన్‌కే పరిమితం అయ్యేలా చేయడమే కాదు.. ఎన్నో పరీక్షలను కూడా రద్దు చేసింది.. కీలకమైన బోర్డు ఎగ్జామ్స్‌కు రద్దు చేసి.. అందరు విద్యార్థులను పాస్ చేసిన పరిస్థితి.. అయితే, ఈ తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ… ఎంసెట్ అడ్మిషన్స్, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా, 5 సంవత్సరాల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్స్ కి అర్హత.. ఇంటర్…
కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఇదే సమయంలో.. జులై 1వ తేదీ నుంచి పాఠశాలలను తిరి ప్రారంభిస్తామని ప్రకటించింది.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కరోనా పరిస్థితిపై సమీక్షించి ఈ నిర్ణయానికి వచ్చారు.. ఇక, రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభం, ప్రత్యక్ష తరగతుల పై పాఠశాల విద్యాశాఖ కొన్ని ప్రతిపాదనలు చేసింది.. జులై 1వ తేదీ నుండి 8, 9, 10 తరగతులు ప్రారంభం కానుండగా.. ఉదయం 9.30…