Telangana Assembly Sessions Live: తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం అయ్యింది. తెలంగాణలో మూడోసారి కొలువు దీరిన ప్రభుత్వ ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. మొదటి రోజు మృతిచెందిన సభ్యులకు సంతాపం ప్రకటించాక ఎల్లుండికి సభ వాయిదా వేయనున్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధులు మల్లు స్వరాజ్యం, కమలాపూర్ మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్దన్‌రెడ్డిలకు నివాళి అర్పిస్తారు. శాసనమండలిలో తొలిరోజు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాలు, వరదలతో సంభవించిన…