Juice diet: కఠినమైన ‘‘డైట్’’ ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తుందో తెలుసుకోవడానికి ఈ ఘటనే నిదర్శనం. డాక్టర్లు, పోషకాహార నిపుణుల సలహాలు లేకుండా, మూడు నెలలుగా కేవలం ‘‘జ్యూస్’’లు తాగుతూ డైట్ పాటించిన 17 ఏళ్ల కుర్రాడు మరణించాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కొలాచెన్‌లో జరిగింది. మృతుడు శక్తిశ్వరన్, గత మూడు నెలలుగా తీవ్రమైన డైట్ ప్లాన్ లో ఉన్నట్లు కుటుంబీకులు చెప్పారు. అయితే, శక్తిశ్వరన్ ఆరోగ్యంగా, చురుగా ఉన్నాడని, అంతలోనే మరణించడంపై…