Supreme Court: సుప్రీంకోర్టులో సోమవారం బీహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై విచారణ జరిగింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మ్లయ బాగ్చిలతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ.. ఏ దశలోనైనా కేంద్ర ఎన్నికల సంఘం తప్పుడు పద్ధతిని అవలంబించిందని తేలితే, ఆ పరిస్థితిలో మొత్తం SIR ప్రక్రియను రద్దు చేస్తామని పేర్కొంది. బీహార్ SIRపై తాము ముక్కలుముక్కలుగా అభిప్రాయాన్ని ఇవ్వలేమని స్పష్టం చేసింది. బీహార్‌లోనే కాకుండా భారతదేశం అంతటా SIR ప్రక్రియకు వర్తిస్తుందని ధర్మాసనం తేల్చి…